Friday, May 3, 2024

అందమైన ప్రేమ కథ

- Advertisement -
- Advertisement -

లక్ష్మీ కందుకూరి సమర్పణలో సరస్వతి క్రియేషన్స్, త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నవీన్ చంద్ర, క్రిష్ సిద్దిపల్లి, గాయత్రి, ఆర్.సురేష్, అదితి మ్యాకల్, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నేను లేని నా ప్రేమ కథ’. సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, డాక్టర్ భాస్కర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రం ట్రైలర్, పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల, కొరియోగ్రాఫర్ స్వర్ణ బాబు. అంజనా షా, గుంటూరు లక్ష్మణ్‌లు చిత్రంలోని పాటలను విడుదల చేయగా డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య ట్రైలర్‌ను విడుదల చేశారు.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ “ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయి. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి”అని తెలిపారు. చిత్ర దర్శకుడు సురేష్ ఉత్తరాది మాట్లాడుతూ “ఎన్ని తరాలు మారినా ప్రేమ అజరామరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన చిత్రమిది”అని అన్నారు. చిత్ర నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ “విభిన్నమైన కథాంశంతో వస్తున్న సినిమా ఇది. ఈ ఫీల్‌గుడ్ మూవీ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది”అని చెప్పారు.

‘Nenu Leni Naa Prema Katha’ film to release on Oct 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News