Tuesday, May 14, 2024

నెదర్లాండ్స్ విజయం

- Advertisement -
- Advertisement -

హరారే: వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం ఒమన్‌తో జరిగిన సూపర్ సిక్సెస్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 74 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 48 ఓవర్లలో 362 పరుగుల భారీ స్కోరును సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు. నెదర్లాండ్స్ టీమ్‌లో ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ సెంచరీతో కదం తొక్కాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన విక్రమ్‌జీత్ 109 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 110 పరుగులు చేశాడు.

మరో ఓపెనర్ మాక్స్ డౌడ్ 35 పరుగులు సాధించాడు. ఇదిలావుంటే వెస్లీ బర్రెసి అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు.ఒమన్ బౌలర్లను హడలెత్తించిన వెస్లీ 65 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేశాడు.ఈ క్రమంలో 3 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. బాస్ డి లీడ్ కూడా వేగంగా 39 పరుగులు సాధించాడు. దీంతో నెదర్లాండ్స్ భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు సాధించింది. అయితే వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. ఒమన్ జట్టులో అయాన్ ఖాన్ అజేయ శతకం సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అయాన్ 92 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 105 పరుగులు చేశాడు. అతనికి షోయబ్ ఖాన్ (46) సహకారం అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News