Friday, May 3, 2024

నేటి నుంచి కొత్త బస్సులు అందుబాటులోకి…

- Advertisement -
- Advertisement -

జెండా ఊపి ప్రారంభించనున్న మంత్రి పొన్నం
ముందుగా 80 బస్సులు…
రూ.400 కోట్ల వ్యయంతో మొత్తం 1,050 కొత్త డీజిల్ బస్సులు
విడతల వారీగా రోడ్లపైకి…

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) నిరంతరం కృషి చేస్తోంది. అందులో భాగంగా మరిన్ని బస్సులను నేటి నుంచి అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. దీంతోపాటు రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసి నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఎసి రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను అందుబాటులోకి టిఎస్ ఆర్టీసి యాజమాన్యం తీసుకురానుంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి, 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసి ప్లాన్ చేసింది.

30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఎసి, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్…
మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది. ఆధునిక హంగులతో కూడిన ఈ 80 కొత్త బస్సులను శనివారం నుంచి వినియోగంలోకి ఆర్టీసి తీసుకురానుంది. వాటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఎసి, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) బస్సులున్నాయి. ఈ కొత్త బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నేడు ఉదయం 10 గంటలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రవాణా, రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఐఏఎస్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తో పాటు టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Ponnam

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News