Tuesday, May 7, 2024

ఉద్యోగస్తులకు బిట్స్ ఫిలానీ సరికొత్త ఇంజనీరింగ్ కోర్స్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో పని చేసే నిపుణుల కోసం బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ( బిట్స్ పిలానీ) అందిస్తున్న వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ విభాగం, ఇప్పుడు సరి కొత్తగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ డిగ్రీ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. బిటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ ఈఈఈ గ్రూపు నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సత్య సుధాకర్ యడ్లపల్లి మాట్లాడుతూ ఇది ముఖ్యంగా కోర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) రంగంలో కెరీర్ మార్గాలను అనుసరించడంలో నిపుణులకు సహాయపడటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, టెలికమ్యూనికేషన్స్, సెమీకండక్టర్, ఎల్‌ఓటి అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్,

అనుబంధ డొమైన్ల వంటి కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన నిపుణులు (మరియు వారి సంస్థలు) ప్రోగ్రామ్ నుండి గణనీయంగా ఉపయోగపడుందన్నారు. మొత్తం 7సెమిస్టర్ ల ఈ డిగ్రీ ప్రోగ్రామ్, ఫౌండేషన్ సైన్సెస్, కోర్ టెక్నాలజీలు, ఎగ్జిక్యూషన్ మేనేజ్మెంట్ యొక్క సమ్మేళనం గా ఉంటుందన్నారు. ఉద్యోగస్తులు వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తునే దీనిని కొనసాగించవచ్చన్నారు.. ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్స్ లాంటి ఏదైనా సమానమైన స్పెషలైజేషన్లో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ ఇందుకు అర్హులని తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 11 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News