Monday, September 22, 2025

సోమవారం రాశి ఫలాలు (22-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం –  ప్రతి విషయం మొదట నింపాదిగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకుంటారు.

వృషభం – కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది. పొదుపు పథకాలను నామమాత్రంగా పాటించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.

మిథునం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం,  ఆహారం విషయాలలో మెలకువలు పాటించండి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం – కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. రెండు మూడు రకాలుగా ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. డాక్యుమెంటేషన్ లో మీకు తెలియకుండానే సాంకేతిక లోపాలు దొర్లే అవకాశం ఉంది.

సింహం – వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సహాయం పొందగలుగుతారు.

కన్య –  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. భూవివాదాలు తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తుల – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. సామాజిక సేవా సంస్థలలో పాలుపంచుకుంటారు.

వృశ్చికం – అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వాహనానికి సంబంధించిన విషయాలు తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. స్వల్ప ధన లాభ సూచన.

ధనుస్సు – విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మీకు మేలు చేస్తుంది. మూర్ఖులతో వాదించడం కన్నా దూరంగా ఉండటమే మంచిది అని గ్రహించండి.

మకరం – వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అంతరంగీక మిత్రుల నుండి సలహాలు సూచనలు ఎక్కువగా తీసుకుంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కుంభం – చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి స్వల్ప ధన లాభం పొందుతారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

మీనం – మీరు శ్రమించిన ఒకానొక వ్యవహారంలో లాభం వస్తుంది. ఒక తిరుగులేని అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి.

Weekly rasi phalalu next week

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News