Sunday, April 28, 2024

సైబరాబాద్‌లో కొత్తగా ట్రాఫిక్ నిబంధనలు

- Advertisement -
- Advertisement -

వాటర్ ట్యాంకర్లు, జెసిబిలు, ట్రాక్టర్లకు
ట్రాఫిక్ జాం ఏర్పడడంతో నిర్ణయం
డ్రైవర్లు యూనిఫాం ధరించాలి
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
వివరాలు వెల్లడించిన డిసిపి శ్రీనివాస్ రావు

మనతెలంగాణ, సిటిబ్యూరోః సైబరాబాద్‌లో ట్రాఫిక్ పెరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దానికి అనుగుణంగా కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస రావు తెలిపారు. గచ్చిబౌలిలోని ట్రాఫిక్ డిసిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఎడిసిపిలు శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస రావు మాట్లాడుతూ రద్దీ పెరగడం వల్ల పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

భారీ వాహనాలు, మీడియా వాహనాలు, డిసిఎంలు, వాటర్ ట్యాంకర్లు, ఆర్‌ఎంసి, జెసిబిలు, ట్రాక్టర్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో గతంలో కంటే కొత్త నిబంధనల ప్రకారం తిరుగాల్సి ఉంటుందని తెఇపారు. ఈ వాహనాలు ఉదయం 7.30 నుంచి 11:30 గంటల వరకు సాయంత్రం 4:00 నుంచి రాత్రి 10.30 గంటల వరకు రోడ్లపై తిరగడం నిషేధించినట్లు తెలిపారు. కన్‌స్ట్రక్చన్, డెమోలుషన్ వాహనాలు ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 10:30 వరకు రోడ్లపై నిషేధించామని తెలిపారు. అన్ని భారీ, గూడ్స్, నెమ్మదిగా కదిలే వాహనాలు ఫ్లై ఓవర్లపై వెళ్లడం నిషేధించామని తెలిపారు.

నిషేధిత సమయాల్లో ఏవైనా భారీ వాహనాలు తిరుగుతున్నట్లయితే, ఎంవి యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని, మొదటి సారి జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే వాహనాలను సీజ్ చేసి ఆర్‌టిఏ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. మల్టీప్లెక్స్ థియేటర్, ఇతర వ్యాపార భవనాలు పార్కింగు లేకుండా రోడ్డుపైన వాహనాలను పార్కింగ్ చేసేవారిని గుర్తించి వారికీ నోటీసులు సర్వ్ చేసి యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 55 పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పాదచారులు ఫుట్ పాత్‌లు, పాదచారుల సిగ్నల్‌లు, పాదచారుల క్రాసింగ్‌లు లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో వాహనాలు నడిపే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు , ఇతర రవాణా వాహనాల డ్రైవర్లు యూనిఫాం ధరించాలని స్పష్టం చేశారు. స్కూల్, కాలేజ్ విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, దీనిపై వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాంగ్ రూట్ లో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు చేస్తే ఐపిసి 304 పార్ట్(2) కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించుకుని వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News