Wednesday, May 15, 2024

బార్బీ డాల్

- Advertisement -
- Advertisement -

Nidhi Agarwal shines like a Barbie doll

 

నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది ఈ భామ. బాలీవుడ్ నుంచి వచ్చిన ఆమెకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో అవకాశాలు ప్రస్తుతం భారీగా వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకొని తన క్రేజ్ పెంచుకుంది నిధి అగర్వాల్. మరోవైపు తమిళంలోనూ ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే జయం రవితో ‘భూమి’, శింబుతో ‘ఈశ్వరన్’ సినిమాలలో నటించింది ఈ బ్యూటీ. ఈ రెండు సినిమాలతో తమిళనాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్. ఈ మధ్య ఆమెకు అక్కడ ఏకంగా గుడి కూడా కట్టారు. తక్కువ సినిమాలతోనే అంత అభిమానం సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది నిధి అగర్వాల్. అయితే తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అచ్చంగా బార్బీ డాల్ లాగా మెరిసిపోతోంది నిధి అగర్వాల్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News