Friday, May 3, 2024

క్వారంటైన్‌కు నిలోఫర్ వైద్యులు

- Advertisement -
- Advertisement -

Niloufer Doctors

 

మన తెలంగాణ, హైదరాబాద్ : నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఈనెల 15వ తేదీ రాత్రి విధుల్లో పాల్గొన్న వారితో పాటు 16,17 తేదీల్లో మూడు షిప్టుల్లో పనిచేసిన ప్రతి ఒక్కరూ క్వారంటైన్‌కు వెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఈమూడు రోజులు కలిపి దాదాపు 10మంది అసోసియేట్ ప్రొపెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 40మంది ఇతర సిబ్బంది విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. నారాయణపేట్ జిల్లా అభంగాపూర్‌కు చెందిన ఓ మహిళ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించింది.

డిశ్చార్జి అయ్యాక రెండు నెలల వయస్సు చిన్నారి అస్వస్దతకు గురవడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో ఆచిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈకుటుంబంలోని ఆరుగురిని క్వారంటైన్‌కు పంపించారు. చిన్నారికి వైద్యచికిత్సలు అందించిన వైద్యులు, ఇతర సిబ్బందికి కూడా సోకే ప్రమాదముందని ఆసుపత్రి ఉన్నతాధికారులు రెండు రోజుల పాటు సేవలందించిన సిబ్బందిని ఆదివారం నుంచి క్వారంటైన్‌కు పంపించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో వందలామందికి కరోనా చికిత్సలు అందిస్తున్న డాక్టరు, ఇద్దరు నర్సులకు సోకడంతో నిలోఫర్ వైద్యులకు కూడా అలాంటి లక్షణాలు ఉండే అవకాశముందని ముందు జాగ్రత్తలో చర్యలో భాగంగా క్వారంటైన్‌కు తరలించినట్లు జిల్లా వైద్యాధికారులు వివరిస్తున్నారు.

 

Niloufer Doctors to Quarantine
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News