Thursday, May 9, 2024

అగ్నిమాపక శాఖ సేవలు అద్భుతం

- Advertisement -
- Advertisement -

mahamood ali

 

మనతెలంగాణ/హైదరాబాద్‌ః కరోనా నియంత్రణలో భాగంగా అగ్నిమాపక శాఖ సేవలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ఆలీ పేర్కొన్నారు. నగరంలోని చార్మినార్ వద్ద ఆదివారం నాడు అగ్నిమాపక శాఖ ద్వారా చేపట్టిన రసాయన (సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం) పిచికారీ కార్యక్రమంలో మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు ఇప్పటివరకు వాక్సిన్ కాని, మందు కాని లేదని, ఈ వైరస్ వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఇతర శాఖలు ఈ కరోన వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా అహర్నిశలు కృషి చేస్తున్నాయని కొనియాడారు. ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను గౌరవించి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హోం మంత్రి కోరారు.

ప్రజలు లాక్ డౌన్ కు సహకరిస్తున్నారని, కాని కొందరు లాక్ డౌన్ సమయంలో అవసరం లేకున్నా బయటకు వస్తున్నారని, ఇది ప్రమాదకరమని ప్రజలు గుర్తించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా, అగ్నిమాపక శాఖ తెలంగాణ రాష్ట్రం అంతటా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తోందన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన మొదటి రోజే, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పేదలకు కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 12 కేజీల బియ్యం, ఇతర సామగ్రి ఉచితంగా ప్రకటించి అమలు చేస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి 1500 రూపాయల నగదు కుడా ఇస్తున్నామని తెలిపారు.

త్వరలోనే, కరోనా పై విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నగర సిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ ప్రజలు లాక్ డౌన్ కు పూర్తిగా సహకరించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్పుడే కరోన వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని ఆయన వివరించారు. కార్యక్రమంలో చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎంఎల్‌ఎ ముంతాజ్ అహ్మద్ ఖాన్, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ ఇంచార్జ్ డైరెక్టర్ జనరల్, సంజయ్ జైన్, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి పాపయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు ః రాష్ట్రంలో లాక్ డౌన్ ఉన్నందుకు ముస్లింలు ఇళ్లలోనే నమాజ్ చదవాలని, ఇఫ్తార్ కుడా కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని హోం మంత్రి విజ్ఞప్తి చేసారు. కరోరా వైరస్ విస్తరించకుండా ముస్లిం సోదరులు తమ వంతు పాటుపడాలని కోరారు. గుంపులు గుంపులుగా వెళ్లడం వలన కరోనా మరింత విస్తరిస్తుందని, అందువల్ల ప్రతి ఒక్క ముస్లిం ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని హోంమంత్రి సూచించారు.

 

Fire department services are awesome
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News