Tuesday, May 7, 2024

యుపిలో కూలిన ప్రహరీ గోడ: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -


లక్నో: ఉత్తర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. లక్నోలోని సైనిక భవనం ప్రహరీ గోడ కూలిపోవడంతో తొమ్మిది మంది చనిపోయారు. దిల్‌కుషా ప్రాంతంలో ఓ సైనిక భవనం ప్రహరీ గోడకు కూలీలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. భారీ వర్షం పడడంతో అర్థరాత్రి సమయంలో గోడ కూలి గుడిసెలపై పడడంతో తొమ్మిది మంది చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. శిథిలాలను తొలగిస్తుండగా ఓ వ్యక్తిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యుపి సిఎం ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులను రూ.2 లక్షలు పరిహారం ఇస్తామని సిఎం ప్రకటించారు. యుపిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొన్ని ప్రాంతాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News