Saturday, May 4, 2024

నియంత్రిత సాగుతో రైతులకు లాభం: మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Niranjan Reddy visited Ramagundam fertilizer plant

పెద్దపల్లి: రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతులు సంఘటిత శక్తిగా ఎదగాలన్నదే సింఎం కోరికన్నారు. రైతుల సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు రైతు వేదిక నిర్మాణం చేశాం. నియంత్రిత సాగుతో రైతులకు లాభం కలుగుతోంది. రూ. 6,120 కోట్లతో ఎరువుల కర్మాగారం పున:ప్రారంభం కాబోతుందని చెప్పారు.

సెప్టెంబర్ నుంచి యూరియా ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. సిఎం ప్రత్యేక చొరవతో పనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయి. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తం. తెలంగాణ వ్యవసాయ అభివృద్ధిలో ఆర్ఎఫ్ సిఎల్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి ఏటా 12.50లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఆర్ఎఫ్ సిఎల్ ఉత్పత్తి చేయనుంది. సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి దశలోకి వస్తుంది. రైతులను రాజును చేయాలన్నదే సిఎం కెసిఆర్ ఆలోచన. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంఎల్ఎలు చందర్, పట్టమధు, మనోహర్ రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News