Friday, April 26, 2024

సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలి: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

Nirmala Sitharaman

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించిన చివరి విడుత వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆర్థిక మంత్రి ఆదివారం ప్రెస్ మీట్ లో పైనల్ ప్యాకేజీ గురించి మాట్లాడుతూ.. పేదలకు ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. వచ్చే మూడు నెలలు నిత్యావసరాలు అందిస్తామని ఇప్పటికే చెప్పాం. ఈ సంక్షోభ సమయాన్ని అవకాశంగా మలుచుకోవాలి.

మే 16 వరకు 8.19 కోట్ల మంది రైతులకు నేరుగా రూ.2వేల కోట్లు ఇచ్చాం. 20 కోట్ల మంది మహిళల జన్ ధన్ ఖాతాల ద్వారా  రూ.10,025 కోట్లు జమచేశాం. 2.2 కోట్ల మంది నిర్మాణ రంగ కూలీలకు రూ.3,950 కోట్లు ఇచ్చాం. రైతులకు మొత్తం రూ.3వేల కోట్లు ఇచ్చాం. ఉజ్వల పథకం కింద 6.81 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశాం. జీవనం, జీవనోపాధిపై దృష్టి పెట్టాం. లాక్ డౌన్ తర్వాతి కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాం. 12లక్షల మంది ఇపిఎఫ్ ఖాతాదారులు ఒకేసారి నగదు విత్ డ్రా చేసుకున్నారు. ఐదో విడత ఆర్థిక ప్యాకేజీలో ఏడు రంగాలపై ఇవాళ దృష్టి సారించాం.

1. ఉపాధి హామీ , 2. హెల్త్, 3 వ్యాపారాలు, 4, డీక్రిమినలైజేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్, 5. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్, 6. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ పాలసీ, 7. రాష్ట్ర ప్రభుత్వాలు-వనరులు 

రాష్ట్రాల్లో ఆరోగ్య సేవల కోసం రూ.4,100 కోట్లు ఇచ్చాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించుకోడానికి కంపెనీలకు, స్కూళ్ల డిజిటలైజేషన్ కు అనుమతిస్తున్నం. స్వయంప్రభ ఛానెల్ ద్వారా ఇప్పటికే ఆన్ లైన్ పాఠాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మరో 12 చానెళ్లను ప్రారంభిస్తున్నాం. విద్యా ప్రసారాల కోసం 4గంటల ఎయిర్ టైమ్ కేటాయించాం. బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి రూ.61 వేల కోట్లు కేటాయించాం. ఇప్పుడు అదనంగా రూ.40వేల కోట్ల ఉపాధి హామీకి కేటాయించాం. సొంతూళ్లకు తిరిగివెళ్తున్న వలస కూలీలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నం. ఆరోగ్య రంగంలో సంస్కరణలు తీసుకొస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

అన్ని జిల్లా ఆస్పత్రులల్లో అంటువ్యాధుల చికిత్స విభాగం ఏర్పాటు చేయాలి. బ్లాక్ లెవెల్లో పబ్లిక్ హెల్త్ ల్యాబ్ లను నిర్మించాలి. కరోనా కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలకు భారీ ఊరట కల్పిస్తాం. నష్టాల కారణంగా డిఫాల్టర్లుగా మారిన వారిపై ఏడాది పాటు ఎలాంటి చర్యలు ఉండవు. అన్ని రంగాల్లోకి ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అనుమతి ఇస్తోంది. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ లపై కొత్త పాలసీని తీసుకువస్తున్నం. కోవిడ్ పై పోరాటానికి రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందిస్తాం.

రాష్ట్రాల ఆదాయం పడిపోయిన విషయం గుర్తించాం. టాక్స్ రెవెన్యూ కింద ఏప్రిల్ వరకు రాష్ట్రాలకు రూ. 46,038 కోట్లు ఇచ్చాం. రెవెన్యూ లోటు కింద రూ.12,390 కోట్లు రాష్ట్రాలకు ఇచ్చాం. రాష్ట్రాల జిఎస్ డిపిలో అప్పు పరిమితి 3శాతం నుంచి 5శాతానికి పెంచుతున్నం. రాష్ట్రాలకు 4లక్షల 28వేల కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రాల ఓవర్ డ్రాప్ట్ టైమ్ 14 నుంచి 21 రోజులకు పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

 

Nirmala sitharaman address press conference

 

- Advertisement -
Previous article
Next article

Related Articles

- Advertisement -

Latest News