Sunday, April 28, 2024

ఎన్నికల బాండ్లపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

రాజకీయ పార్టీలకు విరాళాలు అందచేసిన 30 కంపెనీలలో కనీసం 15 కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి చర్యలు ఎదుర్కొన్నయని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దాడులకు, విరాళాలకు ముడిపెడుతూ చేస్తున్న వాదనలు ఊహాజనితమైనవని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆమె పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2013లో అప్పటి యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలెక్టోరల్ ట్రస్ట్ సీమ్‌ను ప్రస్తావిస్తూ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ఇదివరకటి విధానం పూర్తిగా లోపభూయిష్టమని ఆమె చెప్పారు.

ఇసి విడుదల చేసిన ఎన్నికలబాండ్ల వివరాలపై అడిగిన ఒక ప్రశ్నకు ఆమె జవాబిస్తూ ఇడి దాడుల తర్వాతే విరాళాలు ఇచ్చారన్న మీ ఆలోచనే ఊహాజనితమైనదని చెప్పారు. విరాళాలు ఇచ్చిన తర్వాత కూడా ఇడి ద్వారా కంపెనీలపై దాడులు జరిపించకూడదా అని ఆమె ప్రశ్నించారు. ఇడి దాడులు చేసిన తర్వాత తమను తాము రక్షించుకోవడానికి అవి తమకు విరాౠలు ఇచ్చాయనడం ఊహాజనితమైనదని ఆమె అన్నారు. రెండవ ఊహాజనిత వాదన ఏమిటంటే వారు బిజెపికే ఇచ్చారని గ్యారెంటీ ఏమిటని, ప్రాంతీయ పార్టీలకు కూడా నిధులు ఇచ్చి ఉండవచ్చని నిర్మల అన్నారు. ఎన్నికల రాజకీయ పార్టీలు అందుకున్న ఎన్నికల బాండ్లకు చెందిన విశిష్ట సంఖ్యను వెల్లడించకపోవడంపై ఎస్‌బిఐని సుప్రీంకోర్టు శుక్రవారం మందలించడంపై ఆమె స్పందిస్తూ ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉందని,

తీర్పు మాత్రం వచ్చిందని తెలిపారు. గత ఆర్థిక మంత్రి(అరుణ్ జైట్లీ) ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టినపుడు అన్న మాటలను ఆమె గుర్తు చేశారు. ఇది గత విధానాల కన్నా మెరుగైనదని, డబ్బు ఖాతాల నుంచి పారీ ఖాతాలోకి వస్తోందని జైట్లీ చెప్పారని ఆమె అన్నారు. ఇది పరిపూర్ణమైనది కాదని, అయితే ఎవరేం చేయాలో చేసిన విధానం నుంచి కొత్త విధానంలోకి వచ్చామని ఆమె అన్నారు. పరిపూర్ణమైనది పూర్తిగా లోపభూయిష్టమైన విధానం నుంచి పరిపూర్ణం కాని విధానంలోకి వచ్చామని ఆమె వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News