Saturday, April 27, 2024

ఇతర మతాలపై మాట్లాడే దమ్ముందా ?: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఉదయనిధి ప్రకటనలు ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చారు. “ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి ఒక మంత్రి అయ్యారు. ఇతరుల విశ్వాసాలు, నమ్మకాలు దెబ్బతీయనని ప్రమాణంలో స్పష్టంగా చెప్పారు. అది మీ సిద్ధాంతమే అయినప్పటికీ,

ఒక మతాన్ని ధ్వంసం చేస్తాననే హక్కు మీకు లేదు” అని సీతారామన్ ఉదయనిధిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉదయనిధి వ్యాఖ్యలు చేసేటస్పుటు అదే వేదికపై ఉన్న హిందూ రెలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ మంత్రి పీ. శేఖర్‌బాబుపై కూడా సీతారామన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అనుసరించేవారిని నాశనం చేయాలన్న లక్షంతో ప్రసంగం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా హిందూ ఆలయాలను రక్షిస్తారు ? అని సీతారామన్ ప్రశ్నించారు. ఇతర మతాల విషయంలో ఈ విధంగా మాట్లాడగలరా ? అని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News