Saturday, July 27, 2024

సీతగా సాయి పల్లవి

- Advertisement -
- Advertisement -

చాలా నెలలుగా రామాయణం సినిమా గురించి చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ రాముడిగా నటించనున్నాడు అనే పుకా రుతో ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. అనేకమంది హీరోల పేర్లు, హీరోయిన్ల పేర్లు లిస్ట్ లోకి వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాకి సంబంధించిన ప్రధాన తారాగణం ఇప్పుడు ఖరారైంది. సినిమా షూటింగ్ కూడా డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తీస్తున్న ఈ భారీ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నాడు.

సీతగా సాయి పల్లవి నటించనుంది. రావణుడిగా కన్నడ సూపర్ స్టార్ యష్ నటించనున్నాడు. ఈ నెలలోనే షూటింగ్ మొదలు. ఇక ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తారట. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఫస్ట్ లుక్స్ ఆ రోజు వస్తాయి. సాయి పల్లవి ఇప్పటికే హిందీలో ఒక సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు రెండో చిత్రంగా రామాయణంలో కనిపించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News