Sunday, April 28, 2024

నితిన్ కు పెళ్లి గిఫ్ట్.. అదిరింది..

- Advertisement -
- Advertisement -

Nithin and Keerthi's 'Rang De' Teaser Released

యంగ్ హీరో, కొత్త పెళ్లికొడు నితిన్ కు ‘రంగ్ దే‘ చిత్ర యూనిట్ పెళ్లి కానుకగా సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ అభిమానులతోపాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో నితిన్ సరసన  కీర్తిసురేశ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. పిడివీ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ రోజు రాత్రి 8.30 గంటలకు ఫలక్ నూమా ప్యాలెస్ లో నితిన్, షాలినిల పెళ్లి జరగనుంది. కరోనా కారణంగా ఈ వివాహానికి అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.

Nithin and Keerthi’s ‘Rang De’ Teaser Released

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News