Saturday, May 4, 2024

85 శాతం మందికి ప్రమాదం లేదు

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక చికిత్సతో చాలామంది కోలుకున్నట్లు వెల్లడి
గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగధిపతి డాక్టర్ వినయ్ శేఖర్

Corona virus

 

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్‌ను నిర్మూలించవచ్చునని గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ వినయ్ శేఖర్, అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ డాక్టర్ విష్ణు రావు ప్రజలకు సూచించారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ 19 పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ శేఖర్ మాట్లాడుతూ కరోనా వైరస్ అన్ని వైరస్‌ల లాంటిదేనని, వైరస్ సోకిన ప్రతి వంద మందిలో 85 శాతం మందికి ప్రమాదం ఏమి ఉండదని స్పష్టం చేశారు. వృద్ధులకు వైరస్ సోకిన ప్పుడు మాత్రమే ప్రమాదం పొంచి ఉంటుందని, వీరు డాక్టర్ల సూచనలు, సలహాలు పాటించాలని తెలిపారు.

ఈ వైరస్‌ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి ఈ లక్షణాలకు ఉన్నప్పుడు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం వంటివి చేయాలన్నారు. ఈ వైరస్‌ను శ్వాసలోకి పీల్చినపుడు లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు కళ్ళు ,ముక్కు, నోటి ద్వారా ఇది మన శరీరంలోకి చొరబడుతుందన్నారు. కరోనా సోకిన వారికి ప్రత్యేక చికిత్స అందించడం ద్వారా చాలా మంది రికవరీ అయ్యారని వివరించారు.

సాధారణ ప్రజలకు ఎన్ 95 అవసరం లేదు

డాక్టర్ విష్ణురావు మాట్లాడుతూ వయసు ఎక్కువ ఉన్న వారు ముఖ్యంగా కిడ్నీ, గుండె , లివర్ వంటి వ్యాధులు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధారణ ప్రజలు ఎన్ 95 మాస్క్ లు వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కరోనా సోకిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు, ఎవరికైనా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నాయో వారు మాస్క్ వేసుకోవాలన్నారు. గుంపులలో తిరిగెటప్పుడు కూడా మాస్క్ వేసుకోవలన్నారు. క్లోరోక్విన్ లాంటి మందులను డాక్టర్ సలహా లేకుండా వేసుకోకూడదాని తెలిపారు. మాంసాహారం ద్వారా కరోనా వైరస్ సోకదాని ఆయన స్పష్టం చేశారు. ఆహారాన్ని పూర్తిగా శుభ్రం చేసి సరిగా వండి స్వీకరిస్తే ఎటువంటి అపాయం లేదన్నారు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే , జాయింట్ డైరెక్టర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News