Wednesday, May 8, 2024

తెలంగాణలో భారీ వానలకు ఇక బ్రేక్…త్వరలో మండే ఎండలు!

- Advertisement -
- Advertisement -
ఇటీవల షేక్‌పేటలో గరిష్ఠ స్థాయిలో వానలు కురియగా, ఖాజాగూడా, రామంతాపూర్, ఆనంద్‌బాగ్, శ్రీనగర్ కాలనీలో కూడా భారీగానే వానలు పడ్డాయి.

హైదరాబాద్: గత కొన్ని రోజులగా హైదరాబాద్‌లో వడగండ్లతో కూడిన భారీ వానలే కురిసాయి. ఇక నగరంలో భారీ వానలకు ఫుల్‌స్టాప్ పడొచ్చు. వచ్చే మూడు రోజుల తర్వాత మళ్లీ మండే ఎండలు కాయనున్నాయి. ఇటీవల కురిసిన వానలకు గరిష్ఠ ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తగ్గిపోయింది. అయితే గురువారం, శుక్రవారం మళ్లీ ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చాలా జిల్లాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేసింది.

సోమవారం అక్కడక్కడాభారీ వానలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ్‌పేట్, జోగులాంబ గద్వాల్ ప్రభావితం కానున్నాయి. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులు(గంటకు 40 నుంచి 50 కిమీ. వేగంతో) వీచనున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తన రిపోర్టులో పేర్కొంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News