Friday, May 3, 2024

గవర్నర్ తమిళిసైపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు..

- Advertisement -
- Advertisement -

సూర్యపేట: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రగతి నిరోధకులు తట్టుకులేక పోతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం జరిగిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళసై రాకపోవడం అందులో భాగమేనని ఆయన ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
అభివృద్ధి నిరోదుకులు రానంత మాత్రాన ఒరిగే నష్టం ఏమి లేదన్నారు. ప్రారంబోటత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలి పెడుతున్నామన్నారు. గైర్ హాజరుతో గవర్నర్ నిజ స్వరూపం బట్టబయలు అయిందని మంత్రి విమర్శించారు.

Also Read: మోడీజీ.. ఇప్పటికైనా మెచ్చుకునేందుకు నోరు మెదపరా?

నూతన సచివాలయం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. అటువంటి భవనాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మంచిని మంచిగా చూసే గుణం ప్రతిపక్షాలకు ఉండకపోవడం దురదృష్టకరమన్నారు. జరుగుతున్న అభివృద్ధితో శ్వాసతంగా అడ్రెస్ గల్లంతు అవుతుందన్న బెంగ విపక్షాలను వెంటాడుతుందన్నారు. అందుకే అభివృద్ధి కి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇటువంటి వారికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News