Sunday, April 28, 2024

పియుసి లేకుంటే 25 నుంచి ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ దొరకదు!

- Advertisement -
- Advertisement -

Gopal Rai

న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్(పియుసి) లేకుంటే అక్టోబర్ 25 నుంచి ఢిల్లీలోని పెట్రోల్ పంపుల వద్ద పెట్రోల్, డీజిల్ పోయరు. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శనివారం తెలిపారు. దీనికి సంబంధించిన ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తామని కూడా ఆయన తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడానికి వాహన కాలుష్యం కూడా ఒక కారణమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాలుష్య నివారణ చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జిఆర్ఏపి) విషయంలో ఢిల్లీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు. 6వ తేదీ నుంచి యాంటీ డస్ట్ క్యాంపైన్ కూడా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News