Tuesday, April 30, 2024

రేషన్ షాపుల వద్ద కనిపించని సోషల్ డిస్టెన్స్

- Advertisement -
- Advertisement -

టోకెన్ల కోసం పెద్దత్తున గుమిగూడుతున్న ప్రజలు
పట్టించుకోని పౌరసరఫరా శాఖ అధికారులు,
పత్తాలేని స్థానిక ప్రజాప్రతినిధులు

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రేషన్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ మచ్చుకైనా కనిపించడం లేదు. ఉచిత బియ్యం తీసుకునేందుకు రేషన్‌షాపులకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద పెద్దఎత్తున జనసంచారంతో పాటు పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అయితే క్యూలైన్లలో మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం మాత్రం పాటించడం లేదు. ఉచిత బియ్యం తీసుకునేందుకు రేషన్ షాపు యజామానులు అందించే టోకెన్లు తీసుకునేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఉదయం ఏడుగంటలకే రేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్నారు. ఎలాంటి మాస్కులు లేకుండానే క్యూలైన్లలో నిలుచుంటున్నారు. అయినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి పలు రేషన్ దుకాణాల వద్ద కనిపించింది. ముఖ్యంగా పాతబస్తీలోని పలు రేషన్ షాపుల్లో అయితే క్యూలై సంఖ్య మరీ అధికంగా కనిపించింది. అలగే రాంనగర్, ముషీరాబాద్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లోని రేషన్ షాపుల వద్ద ప్రజలు కనీస దూరం కూడా పాటించిన దాఖలాలు లేవు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఈ వైరస్‌ను నియంత్రించడానికి సోషల్ డిస్టెన్స్ పాటించడం ఒక్కటే పరిష్కార మార్గమని, దీనిని ప్రజలంతా విధిగా పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ రేషన్ దుకాణాల వద్ద సిఎం జారీ చేసిన ఆదేశాలు, సూచనలు ఏ మాత్రం అమలుకావడం లేదని తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటించకూడదన్న లక్షంతో సిఎం కెసిఆర్ తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీతో పాటు రూ.1500 నగదు ఇవ్వాలని సిఎం ఆదేశించారు. ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల క్రితం ప్రారంభమైంది.

అయితే బియ్యం పంపిణీతో పాటు నగదు ఎలా ఇవ్వాలనే అంశంపై పౌరసరఫరాల శాఖ అధికారులు తగు ప్రణాళికను అమలు చేయలేకపోయారు. ఫలితంగా రేషన్ షాపుల వద్దకు రోజు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నాయి. వచ్చిన వారికి అందరికి కూడా టోకెన్లు ఇవ్వడం లేదు. ఉదయం 30, సాయంత్రం 30 టోకెన్లు మాత్రం ఇస్తున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా వాటిని దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉదయం ఏడు గంటల సమయానికే ప్రజలు రేషన్ షాపుల వద్ద గుమిగూడుతున్నారు. ఇప్పటికే మర్కజ్ ఘటన కారణంగా ఒకరి నుంచి మరొకరకి చాలా సులువుగా కరోనా వైరస్ సోకుతోంది. అందువల్ల ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 

No Social distance between people in Rantion shops
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News