Sunday, April 28, 2024

మందు ముద్దు.. మాస్క్ వద్దు

- Advertisement -
- Advertisement -

మద్యం దుకాణాల వద్ద నిబంధనలు నిల్.. గుంపులు.. గుంపులుగా..
పట్టించుకోని వైన్‌షాపు యజమానులు
లాక్‌డౌన్ భయంతో భారీ కొనుగోలు
మాస్కులు, భౌతికదూరంపై నిర్లక్ష్యం

wine-shop

మన తెలంగాణ/పంజాగుట్ట: ఒక వైపు ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి… మరోవైపు నగర వా సుల నిర్లక్షం, ఈ నిర్లక్షంతో ఎక్కడికి పరిస్థితి దారి తీస్తుందో అర్థంకానీ ప్రశ్న…. ఇంత జరుగుతున్నా నగరంలోని మందుబాబులు వ్యవహార శైలి మారడం లే దు. జరిమానాలు వేస్తామని హెచ్చరించిన పెడచెవిన పెడుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా మందుబాబులు వైన్‌షాన్‌ల వద్ద ఎలాంటి నిబంధనలు, జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్షం వహిస్తున్నారు. మందు మీద ఉన్న శ్రద్ధ్ద మాస్కుల మీద చూపించకపోవడంపై బాధకరం. నిబంధనల ప్రకారం వైన్‌షాప్ యజమానులు వినియోగదారులు విధిగా మాస్కులు ధరిస్తే మాత్రమే మందు విక్రయించాల్సి ఉండగా, ఆ నిబంధనలు కే వలం బోర్డ్‌లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు.

అ నేక చోట్ల కనీసం భౌతికదూరం పాటించకుండా మా స్కులు ధరించకుండా వైన్‌షాపుల వద్ద గుంపులు చేరుతున్నారు. ఇక బార్లలో పరిస్థ్దితి మరింత దారుణంగా ఉంది. ఏ ఒక్కరు భౌతికదూరం పాటించకుండా ఒకే దగ్గర గుంపులుగా కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఒకొక్క బార్లో పదుల సంఖ్యలో దగ్గరగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. అయితే అనేకచోట్ల ఈ ని ర్లక్షం ఉన్నప్పటికి నగరంలో వైన్‌షాపుల వద్ద సా యంత్రం కాగానే జన సంచారం ఎక్కువగా ఉంటుందన్న విషయం విధితమే. ఇక గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతుండటంతో కొనగోలు కూడా పెరిగాయి. గత లాక్‌డౌన్‌లో పడ్డ మందు కష్టాలు దృష్టిలో పెట్టుకుని మందుబాబులు భారీగా మద్యం కొనుగోలు చేసి ఇంట్లో భద్రంగా దాచుకుంటున్నారు. మంగళవారం త్వరలో లాక్‌డౌన్, మద్యం షాప్‌లు మూసివేత ఉంటుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరగడంతో పెద్ద సం ఖ్యలో మందు బాబులు వైన్‌షాప్‌ల ముందు బారులు కట్టి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.

మందుపై ఉన్న శ్రద్ధ మనిషి ప్రాణాలపై లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రతి ఒకరు మందుపై పెట్టిన శ్రద్ధ మాస్కుపై పెడితే కరోనా కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. వైన్‌షాపు యాజమానులు కూడా విధిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈమద్యం దుకాణాల వద్ద కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇతర ప్రాంతాల్లో కూడా ప్రతి ఒకరు ఈనిబంధనలు పాటించాలి. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్, సినిమా థియేటర్లు వద్ద మాస్కు ఉంటేనే లోపలికి అనుమతి ఇస్తున్నారు. కానీ మద్యం షాప్‌లు, బార్ల వద్ద నిబంధనలు పాటించకపోతే ఆందోళన కలిగించే అం శం. ఇప్పటికైనా ప్రభుత్వం, మందుబాబులు కరోనా కట్టడి గూర్చి ఆలోచన చేయాల్సి అవసరం ఉందని నగరవాసులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News