Sunday, April 28, 2024

ఎవరీ నోముల భగత్

- Advertisement -
- Advertisement -

Nomula Bhagat Biodata details

 

మన తెలంగాణ/హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు టిఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కు టిఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది. టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ భగత్‌కు బీఫామ్ అందజేశారు. అలాగే పార్టీ ప్రచారం కోసం 28 లక్షల చెక్‌ను అందజేశారు. మంగళవారం ఉదయం నోముల భగత్ నామినేషన్ వేయనున్నారు. నోముల భగత్ గెలుపునకు కృషి చేయాలని పార్టీ నేతలకు కెసిఆర్ దిశానిర్దేశనం చేశారు. ఇక 1984లో నోముల భగత్ జన్మించారు. 2007లో బిటెక్ పూర్తి చేసిన భగత్.. కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. అనంతరం 2010లో ఎంబీఏ పూర్తి చేశారు. 2010 నుంచి 2012 వరకు విస్టా ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేశారు. ఉద్యోగంతో పాటు 2014లో భగత్ కుమార్ లా కూడా చదివారు. అనంతరం 2014 నుంచి 18 మధ్య హైకోర్టులో అడ్వకేట్‌గా భగత్ ప్రాక్టీస్ చేశారు. 2016 వరకు భగత్ ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు.

బయోడేటా….
పేరు : నోముల భగత్ కుమార్
తండ్రి : దివంగత నోముల నర్సింహయ్య
తల్లి : నోముల లక్ష్మి
భార్య : నోముల భవానీ
పిల్లలు : కుమారుడు, కుమార్తె
పుట్టినతేది : అక్టోబర్ 10, 1984
చదువు : బిఈ, ఎంబిఎ, ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం
ఉద్యోగ అర్హతలు :
సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్‌లో జూనియర్ ఇంజనీర్
విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్‌గా బాధ్యతలు
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా విధులు
రాజకీయ అనుభవం : 2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఆర్గనైజర్
సివిల్ ప్రొఫైల్ : నోముల ఎన్.ఎల్ ఫౌండేషన్ చైర్మన్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News