Monday, December 2, 2024

ఆదాయం అరకొర

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా తగ్గిన
పన్నేతర రాబడి ఈ ఏడాది
లక్షం రూ.35వేల కోట్లు..
ఏడు నెలల్లో సమకూరింది
రూ.4,809కోట్లే పాత అప్పులు,
రుణాలపై వడ్డీలకే రూ.17,729
కోట్ల వ్యయం రెవెన్యూ లోటు
రూ.15వేల కోట్లు అప్పులు
తెస్తేనే పాతబాకీల వడ్డీలు చెల్లింపు
ఆదాయ, వ్యయాల మధ్య
పెరుగుతున్న అంతరం కాగ్
తాజా నివేదిక వెల్లడి పలు
రంగాల్లో ఆశించిన మేరకు
సమకూరని రాబడి
మన తెలంగాణ / హైదరాబాద్ : రా ష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర ఆ దాయం గతంతో పోలిస్తే భా రీగా త గ్గింది. ఈ ఏడాది రూ.35, 208.44 కోట్లు వ స్తుందని అంచనా వేయ గా 7నెలల్లో రూ. 480 9.33 కోట్లు మా త్రమే వచ్చింది. గతేడా ది ఇదే పద్దు కింద రూ. 22, 808 కోట్లు వస్తుందని బ డ్జెట్‌లో అంచనా వేస్తే తొ లి 7 నెలల్లోనే అందులో 81 శాతానికి పైగా స మకూరింది. భూముల అ మ్మకం, ఔటర్‌రింగు రో డ్డు టెండర్ల ఖరారుతో భారీ గా ఆదాయం రావడంతో గతేడాది పన్నేతర ఆ దాయం పద్దు కింద కలిసొచ్చింది. ఈ ఏడాది ఇ లాంటివి లేకపోవడం తో రెవెన్యూలోటు ఏర్పడిం ది.మరోవైపు రాష్ట్ర బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయం పెరగకపోవడంతో రెవెన్యూ మిగులు ఉండకపోగా లోటు విస్తరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రాష్ట్ర బడ్జెట్‌లో

ఈ ఏడాది రూ.297.42 కోట్ల రె వెన్యూ మిగులు ఉండవచ్చని ప్రభు త్వం అంచనా వేసింది. కానీ గత ఏప్రిల్ నుంచి అక్టోబ రు నాటికి 7 నెలల్లో అంచనాకన్నా రూ.15, 203.95 కోట్ల లో టు పెరిగింది. కొన్ని రం గాల్లో భారీగా ఆదాయం ఉం టుందని బడ్జెట్‌లో అంచనాలు వేయగా ఆ మేర కు రాబడి లేకపోవడంతో రెవెన్యూలోటు పెరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది మొత్తానికి కలిపి రూ.49,225.40 కోట్ల ద్రవ్యలోటు ఉంటుందనుకుంటే 7 నెలలకే అందులో 71.30 శాతం అంటే రూ.35,120.91 కోట్లు నమోదైన ట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తా జా నివేదికలో ప్రకటించింది. ఈ ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు అంతమేర కొత్త రుణాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. కొత్తగా అప్పులు తెస్తేనే పాతబాకీల కిస్తీలను చెల్లించేందుకు నిధులు సమకూర్చగల పరిస్థితి నెలకొంది.

పాత అప్పులు, రుణాలపై నెలనెలా కట్టాల్సిన వడ్డీ మొత్తం ఈ ఏడాది రూ.17,729.77 కోట్లు ఉంటుందని బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఇందులో రూ.15,152.62 కోట్లు తొలి 7 నెలల్లోనే కట్టాల్సి వచ్చింది. గతేడాది బడ్జెట్‌లో మొత్తం వడ్డీల చెల్లింపులు రూ.22,407.67 కోట్లు ఉంటాయని అంచనా వేస్తే తొలి 7 నెలల్లో రూ.12,956 కోట్లు చెల్లించింది. మరోవైపు పేదల సంక్షేమానికి వివిధ పథకాల కింద రాయితీలను పెద్ద ఎత్తున ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ రాయితీల పద్దు కింద గతేడాది మొత్తం రూ.12,958.70 కోట్లు ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేసి 2023 ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య ఇందులో కేవలం రూ.4431.07 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కానీ ఈ ఏడాది బడ్జెట్ అంచనాను రూ.16,242.42 కోట్లకు పెంచడమే కాకుండా ఇందులో రూ.7690.112 కోట్లను 7 నెలల్లోనే విడుదల చేసింది. గత ఏడాది తొలి 7 నెలల్లో 34.19 శాతముంటే ఈ ఏడాది అంతకన్నా 13.16 శాతం అదనంగా రాయితీల వ్యయం పెరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News