Tuesday, May 7, 2024

పేరుమోసిన రౌడీ షీటర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Noted Rowdy Sheeter Arrested in Old City

కార్వాన్: తప్పించుకు తిరుగుతున్న పేరుమోసిన రౌడీ షీటర్‌ను మంగళ్‌హాట్ పోలీసులు అరెస్టు చేసి నిషేధిత మారణాయుధం డాగర్ (రాంబోనైఫ్)ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో మంగళ్‌హాట్‌లో నివాసముండే మాదాపూర్ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన మహ్మద్ అలీమ్ (39) మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ లో రౌడీ షీటర్ గా కేసు నమోదైంది. అయితే పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఇదే పోలీస్‌స్టేషన్‌కు చెందిన పేరుమోసిన రౌడీ షీటర్ మహ్మద్ చాంద్‌కు ఇతను తమ్ముడు. హత్య, దోపిడీలు, బెదిరించి డబ్బులు లాక్కునే కేసుల్లో నిందితుడైన అలీమ్ 2016 నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అలీమ్ గురువారం రాత్రి మంగళ్‌హాట్ రాజ్‌ధర్‌ఖాన్‌పేట్‌లోని అఖ్తర్ పాన్ షాపు సమీపంలో ఉన్నాడని సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్ జి.రణవీర్‌రెడ్డి ఎస్‌ఐ ఎ.రాజశేఖర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు బి.రాము, కె.మహేష్‌లతో కలిసి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి నిషేధిత మారుణాయుధం డాగర్ (రాంబో నైఫ్)ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News