Saturday, September 20, 2025

ఫిరాయింపు ఎంఎల్‌ఎలకు మళ్లీ నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: ‘మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా?’ అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బిఆర్‌ఎస్‌కు నోటీసు పంపించారు. అదే విధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ కార్యాలయం నుంచి శుక్రవారం నోటీసులు జారీ అయ్యాయి. తాము పార్టీ మారలేదు, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని అనడానికి ఇంకా మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయని ఎమ్మెలకు పంపించిన నోటీసులలో స్పీకర్ పేర్కొన్నట్టు తెలిసింది. కాగా తమ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినందున వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అ

నర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ ఇదివరకే స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని, కనీసం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదని బిఆర్‌ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు ఈ నెలాఖరులోగా విచారణ ప్రారంభించాలని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్‌లో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు. తొలుత బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్ల ఆధారంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించగా, వారిలో ఎనిమిది మంది లిఖితపూర్వకంగా సమాధానాలు అందజేశారు.

‘కారు’ దిగలేదు..చేయి కలపలేదు
నోటీసులు అందుకున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈ నెల 2వ తేదీలోగా స్పీకర్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా, వారిలో ఇద్దరు మినహా మిగతా వారంతా సమాధానాలు ఇచ్చారు. తాము కారు దిగలేదని, పార్టీ కండువా వేసుకున్నంత మాత్రాన పార్టీ ఫిరాయింపుగా పరిగణించ రాదని వారు స్పీకర్‌కు తెలిపారు. నోటీసులకు వారి నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా స్పీకర్ ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు నోటీసు పంపించారు. వారు పార్టీ మారినట్లు మీ వద్ద ఇంకా ఏదైనా ఆధారాలు ఉన్నాయా? అని నోటీసులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News