Tuesday, May 14, 2024

నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు : రమణాచారి

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: సంగీత నృత్యాంశాలను రక్తి కట్టించాలన్నా, సరైన భావ ప్రకటన చేయాలన్నా యువ కళాకారులకు తెలుగు, సంస్కృత భాషలపై పట్టు అవసరమని తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు డా.కె.వి.రమణాచారి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణాదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో నవ్యనాటక సమితి ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న ‘నాయికాభినయం ’శిక్షణా తరగతులు ముగిశాయి.

ఈ ముగింపు కార్యక్రామానికి హాజరైన రమణాచారి మట్లాడుతూ యువ సంగీత, నృత్య కళాకారులు కృషి పట్టుదలతో నిరంతరం సాధన చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చునని హితోపదేశం చేశారు. కళాకారులందరూ మనదేశ సాంస్కృతిక రాయబారులన్నా రు. గౌరవ అతిధి, వైణిక విద్వాంసులు అయ్యగారి శ్యామ సుందరం మాట్లాడుతూ నవ్యనాటక సమితి ఆరున్నర దశాబ్దాల సాంస్కృతిక రంగ సేవను కొనియాడారు. యువ కళాకారులకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ జంట నగరాల్లో తన ప్రత్యేకతను చాటుతుందని కొనియాడారు. నృత్య గురవులు వై.చలపతిశాస్త్రీ , రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ ఉప సంచాలకులు జి.వసుంధరలు వర్క్‌షాపులో పాల్గొన్న కళాకారులందరని సత్కరించారు.

అనంతరం రమణాచారి కార్యశాలను ముగించుకున్న యువ కళాకారులకు ప్రశంశా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు వేమరాజు విజయ్‌కుమార్, నృత్యగురువులు నిష్టల సుధామాల, రేణుకా ప్రభాకర్, నృత్య కళాకారులు, గురువులు మాధవీమాల, ఎన్. శ్రీలత, ఆర్. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News