Tuesday, May 7, 2024

ప్రభుత్వాసుపత్రిలో తొలి ఆక్సిజన్, బాట్లింగ్ ప్లాంట్

- Advertisement -
మోర్తాడ్ మండల కేంద్రం లోని సిహెచ్ సి ఆస్పత్రిలో ఏర్పాటు
రాష్ట్రం మొత్తంలో బాటిలింగ్ యూనిట్ మొదట మోర్తాడ్ లొనే ఏర్పాటు
మిత్రుల సహకారంతో రూ. కోటికి పైగా ఖర్చుతో తొలి ఆక్సిజన్, బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు…
Oxygen batling plant start in balkonda
మోర్తాడ్: మిత్రుల సహకారంతో రూ. కోటి ఖర్చుతో ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గంలో 102 ఆక్సిజన్ బెడ్లు, 14 ఐ సి యూ బెడ్లను ఏర్పాటు చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆక్సిజన్ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్ ను బుధవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 12 ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆర్ఒ ప్లాంట్స్,రిసెప్షన్ ఏరియా, ఇతర సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని వివరించారు. దీంతో పాటు ఆర్మూర్, బోధన్ ఆసుపత్రుల్లో 10 ఐ సి యూ బెడ్లను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.  ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణం కు అయిన ఖర్చు 54 లక్షల చెక్కును మిత్రుల సహకారంతో కలెక్టర్ కు అందజేయడం జరిగిందన్నారు.
కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని.. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేధో మధనంలోనే అక్షిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంకల్పం కలిదగింది. మిత్రుల సహకారంతో వెంటనే రూ. కోటి సమకూర్చి చెక్కును కలెక్టర్ కు అందజేశానని వివరించారు. పనులు వెంటనే చేపట్టి మూడో వేవ్ కరోన ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడం జరిగింది.
కోట్లు సంపాదించిన కూడా కలగని ఆనందం ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా కలిగిందన్నారు. రోజుకు 50 ఆక్సిజన్ సిలెండర్ లు నింపుకుని సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంతో మోర్తాడ్ నుండి నియోజకవర్గం లోని ఇతర హాస్పిటల్స్ కి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసే విధంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు సిద్ధమయ్యాయని ప్రశంసించారు.
ఆసుపత్రుల్లో మంచి వాతావరణాన్ని ఏర్పరచాలని వైద్యులకు, సిబ్బందికి అదేశించానని,  కరోనా మళ్ళీ వచ్చినా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆక్సిజన్ అందక, బెడ్స్ లేకుండా ఒక్కరు చనిపోవడానికి వీల్లేదని సంకల్పం తీసుకొని పనులు పూర్తి చేశామన్నారు. పూర్తిస్థాయి చికిత్స అందిన తర్వాత ఇకపై దేవుడిపై భారం వేద్దామన్నారు.
అధికారం శాశ్వతం కాదు
అధికారం ఎప్పటికి శాశ్వతం కాదని, పదవులు వస్తాయి, పోతాయి. కానీ పదవుల్లో వున్నప్పుడు ప్రజలకు ఎప్పటికి గుర్తుండిపోయే, అవసరమయ్యే పనులు చేయాలన్నారు. అందుకే ప్రజల ఆరోగ్యం ప్రథమప్రాధాన్యతలో తీసుకుని పనులు చేపడుతున్నాము. దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కోవిడ్ సందర్బంగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి కోవిడ్ మరణాలను నిలువరించడంలో సఫలమయ్యామని, నిజామాబాద్ జిల్లాలో సరిపడా రేమిడిసివిర్ ఇంజెక్షన్లు విరివిగా అందుబాటులో ఉంచగలిగామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇలా కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగామని వివరించారు.
పూర్తిస్థాయిలో ఆక్సిజన్ బెడ్ ఏర్పాటు చేయటమే కాకుండా 102 ఆక్సిజన్ సిలెండర్లను వారం రోజుల్లో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇదివరకు మాదిరి కాకుండా ఇకపై ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక ఏ ఒక్కరు మరణించారనే వార్త వినకూడదన్నారు. తన సంకల్పానికి ముందుకు వచ్చి సహకారము అందించిన మిత్ర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News