Tuesday, April 30, 2024

అకాల వర్షాలు.. అపార నష్టాలు

- Advertisement -
- Advertisement -

Paddy Damaged due to Premature rains in Telangana

ధాన్యం అమ్ముకునేందుకు రైతుల అగచాట్లు
రంగు మారిన, తడిసిన ధాన్యం
కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నాలు
ప్రమాణాల ప్రకారమే కొనుగోళ్లు : అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆకాశంలో ఉరుముల శబ్ధాలు వింటే రైతుల గుండే గుభేలు మంటుంది..మెరుపులు మెరిశాయంటే మనసులో అలజడి మొదలైనట్టే..అల్పపీడనాలు అకాల వర్షాలతో రాష్ట్ర రైతాంగం విలవిలలాడిపోతోంది.గాలి వానల ధాటికి పోలం మీదే ధాన్యం గింజెలు జలజల నేలారాలి పోతున్నాయి. పంటకోతలకు కూలీల సమస్య పీడిస్తోంది.కోత మిషన్ల కోసం రోజలు వారాల తరబడి ఎదురు చూపులతోనే వరి రైతుల కళ్లు కాయలు కాస్తున్నాయి. తీరా వరికోతలు పూర్తి చేసి ధాన్యం ఆరబెట్టగానే మండుటెండల్లో సైతం ఆకస్మికంగా కురుస్తున్న వర్షాలు కళ్లమందు వర్షపు నీటిలో మునకేస్తున్నాయి. వర్షం వెలిశాక తడిసిన ధాన్యాన్ని రెండు మూడు రోజులు ఆరబెట్టుకునేలోపే మళ్లి ఉరుములు మెరుపులు రైతుగుండేను గుభేలు మనిపిస్తున్నాయి. ఆరబెట్టిన ధాన్యాన్ని సంచులకు ఎత్తుదామంటే తగినన్ని గన్నిబ్యాగులకోసం తడుముకోవాల్సివస్తోంది. తీరా సంచులకెత్తి కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోతే అక్కడ ధాన్యం విక్రయించేందుకు గంటల్లో పూర్తి కావాల్సిన ప్రక్రియ రోజులు పడుతోంది. మార్కెట్ యార్డుల్లో సైతం ఫ్లాట్‌ఫారాలమీద కుప్పలేసిన ధాన్యం, సంచుల్లో నింపిపెట్టిన ధాన్యం కూడా అకాల వర్షాలనుంచి తప్పించుకోలేపోతోంది. ఇది ఏ ఒక్క జిల్లాకో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాతాల్లో యాసంగి రైతుకు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఏదో ఒక సందర్భంలో ఎదురవుతున్న కష్టాలే ..రాష్ట్రంలో యాసంగి పంటకింద 52లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. నీటి వనరులు అందుబాటులో ఉండటం నిరంతరంగా ఉచిత విద్యుత్ లభ్యత తదితర, పంటసాగులో శ్రమ తక్కువ అన్నభావనతో అత్యధికశాతం రైతులు యాసంగిలో వరిసాగుచేస్తున్నారు. పంటసాగుకు స్పల్పకాలిక విత్తనాలకు బదులు మధ్య, దీర్ఘకాలిక రకాల వంగడాలను ఎంచుకోవటంతో పంటకాల పరిమితి పెరిగుతోంది. మార్చి చివరినాటికి పూర్తివాల్సిన పంటకోతలు మే నెల చివరిదాక కోనసాగుతున్నాయి.సాగువిస్తీర్ణం పెరగటంతో ధాన్యం దిగుబడులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో మరేరాష్ట్రంలో లేనంతగా ఈ యాసంగిలో కోటి 30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, వాతారణ పరిస్థితుల అధ్యయనాలను బట్టి ఈ ప్రాంతం మండు వేసవిలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, పిడుగులకు అవకాశం ఉన్నప్రాంతం అని వాతావరణ రంగం నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఇటు వంటి పరిస్థితులు ప్రతి ఏటా కళ్లకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి. యాసంగిలో వారాల తరబడి సాగుతున్న వరినాట్లు పంటల కోతల్లో జాప్యానికి కారణమవుతున్నాయి. దీంతో పంట కోతల సమయంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతుల నెత్తిన పిడుగులు కురిపిస్తున్నాయి. వర్షానికి తడిసిన ధాన్యం సకాలంలో ఆరబెట్టలేకపోతే తడిమీద మొలకలు వస్తోంది. తేమఅధికంగా ఉంటే బూజు పడుతోందని రైతులు ఆవేదకన వ్యక్తం చేస్తున్నారు. పంట బాగున్న ధాన్యం క్వింటాలుకు మద్దతు ధర రూ.1880ఉండగా, తేమ తాలు తట్టల పేరుతో ధరలో కోతలు పడుతూనే ఉన్నాయి. ఇక తడిసిన ధాన్యం విక్రయించుకోవాలంటే మాటలో చెప్పినంతు సులువేమి కాదంటుంటున్నారు. తడిసిన ధాన్యం వెంటనే రంగు మారిపోతోంది. దీంతో ఈ రకం ధాన్యం ధరపై రైతులు పెద్దగా ఆశలుపెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఏడాది ఏప్రిల్ ,మే నెలల్లో ఆయా జిల్లాలనుంచి అందిన సమాచారాన్ని బట్టి వరి రైతు ఇప్పటికే రూ.2000కోట్ల రూపాయల విలువమేరకు నష్టపోయనట్టు తెలుస్తోంది. దక్షిణ తెలంగాణ జిల్లాలకంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అకాల వర్షాలతో పంట నష్టాలు అధికంగా ఉన్నట్టు సమాచారం. అకాల వర్షాలతో పంటనష్టాలపై వ్యవసాయ శాఖ ఇప్పటివరకూ ఎటువంటి నివేదికలు వెల్లడించలేదు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకూడా తడిసిన ధాన్యం ఎంత అన్నది వివరాలు సేకరించేలేదు.
క్షేత్ర స్థాయిలో సమస్యల ముసురు:
యాసంగిలో ధాన్యం కొనుగోలుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో పెద్దమనసుతో ముందుకు వచ్చినా క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాగం నిర్లక్షత యాసంగి పంటసాగు రైతులను నష్టాలబారినుంచి తప్పించలేకపోతోంది. పంటసాగులో కష్టాలు దాటుకుని వచ్చిన రైతుల అశలను అకాల వర్షాలు కళ్లాల్లో కళ్లముందే నిలువునా నీట ముంచుతున్నాయి. ఏటా ధాన్యం కొనుగోలుకు 20కోట్ల గన్నిసంచులు అవసరం కాగా ప్రతి సీజన్‌లో వీటికోసం దేవులాడుకోవాల్సి వస్తోంది. గన్ని సంచులు సకాలంలో అందక ధాన్యం కుప్పలు రోజుల తరబడి అలాగే ఉంచాల్సి వస్తోంది. ఎండ వానల నుంచి ధాన్యం నిల్వలను కాపాడుకునేందుకు ప్రభుత్వం టార్పాలిన్లు ఇస్తున్నా, అవి రైతులందరికీ చేరటం లేదు. అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకోలేక నష్టపోతున్న రైతుల్లో సన్న చిన్న కారు రైతులే అధికంగా ఉన్నట్టు సమాచారం. తడిసిన ధాన్యం కుప్పలపైన పడి గుండెలవిసేలా చేస్తున్న రోదనలు ఈ వర్గం రైతులనుంచే అధికంగా వినిపిస్తున్నాయి. తడిసిన ప్రతి ధాన్యం గింజను కోనుగోలు చేస్తామని అధికారులు పదేపదే ప్రకటనలు చేస్తున్నా ఇవి పూర్తి స్ధాయిలో రైతుల కన్నీళ్లు తుడవలేకపోతున్నాయి.
మిల్లర్ల గుప్పిట్లో ధాన్యం కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్లప్రక్రియ మిల్లర్ల గుప్పిటనుంచి బయటపడలేకపోతోంది. ప్రభుత్వం ఈ యాసంగిలో 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులనుంచి కోనుగోలు చేయాలని లక్షంగా పెట్టుకుంది. సిఎం రైతుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని ఇందుకోసం రూ.20వేలకోట్లు సమకూర్చారు. 6853ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారు. ఇంత చేసినా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు ధాన్యం కొనుగోలు లక్ష్యాలను మందగింపచేస్తున్నాయి. వరికోతలు ప్రారంభమై నెలన్నర గడిచిపోయినా రాష్ట్రంలో ఇప్పటివరకూ ధాన్యం సేకరణ 50శాతం మించలేదు. గురువారం నాటికి సుమారు 48లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు జరిగినట్టు సమాచారం. కోనుగోలు కేంద్రాల్లో వద్ద జరుగుతున్న జాప్యం అటుంచి రైస్ మిల్లుల వద్ద మరింత జాప్యం జరుగుతోంది. కొనుగోలు కేంద్రాలనుంచి మిల్లులకు ధాన్యం చేరవేసేందుకు తగినన్ని వాహనాలు అందుబాటులో ఉండటం లేదు. మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌లో కూడా రోజుల తరబడి జాప్యం జరుగుతోంది.రోడ్లపై ధాన్యం లోడ్లతో వాహనాలు గంటలు రోజుల తరబడి బారుతు తీరుతున్నాయి. రాష్ట్రంలో 942 బాయిల్డ్ రైస్‌మిల్లులు ,1534రారైస్ మిల్లులు ఉన్నాయి. రోజుకు 1.13లక్షల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ సామర్దం మాత్రమే వీటిలో ఉంది. దీంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు కోండల్లా పేరుకుపోతున్నాయి. కొత్తగా వస్తన్న ధాన్యం అన్‌లోడింగ్‌లో మిల్లర్లు తగినంత శ్రద్ద చూపటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Paddy Damaged due to Premature rains in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News