Thursday, May 2, 2024

పాక్ ఓపెనర్ రిజ్వాన్ అరుదైన రికార్డు..

- Advertisement -
- Advertisement -

కరాచి: పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ట్వంటీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డును సాధించాడు. ఈ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు వేల పరుగులను పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో రిజ్వాన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. 2020-21 క్యాలెండర్ ఇయర్‌లో రిజ్వాన్ ఏకంగా 2036 పరుగులు సాధించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. విండీస్‌తో జరిగిన మూడో టి20లో రిజ్వాన్ 45 బంతుల్లోనే 87 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రిజ్వాన్‌తో పాటు పాకిస్థాన్‌కే చెందిన బాబర్ ఆజమ్ కూడా పొట్టి క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. బాబర్ 1779 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Pak Opener Rizwan hits 2036 runs in 2020-21

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News