Saturday, May 4, 2024

పాక్‌లో రెండో పోలియో కేసు గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Pakistan reports 2nd polio case

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో వారం రోజుల్లో రెండో సోలియో కేసు వెలుగు చూసింది. ఖైబర్ పక్తున్‌ఖ్వా ప్రావిన్సులో ఒక రెండేళ్ల బాలికకు పోలియో సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రంజాన్ సెలవుల కారణంగా ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడే అవకాశం ఉండడంతో పోలియో వైరస్ వ్యాప్తిపై పాక్ ప్రభుత్వం కలవరం చెందుతోంది. పాకిస్తాన్‌తోపాటు దాని పొరుగున ఉన్న అఫ్ఘానిస్తాన్ కూడా ఎంతోకాలంగా పోలియో వైరస్ ముప్పును ఎదుర్కొంటున్నాయి. పోలియో వైరస్ కారణంగా పిల్లలలో శాశ్వత అంగవైకల్యం ఏర్పడే ప్రమాదం ఉంది. ఉత్తర వజీరిస్తాన్ జిల్లాకు చెందిన ఒక 24 నెలల బాలిక నుంచి నమూనాలలో టైప్ 1 వైల్డ్ పోలియోవైరస్‌ను గుర్తించినట్లు పాకిస్తాన్ జాతీయ పోలియో లేబరేటరీ శుక్రవారం వెల్లడించింది. ఏప్రిల్ 22న అదే ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్తాన్‌కు చెందిన ఒక 15 నెలల బాలుడిలో కూడా పోలియో వైరస్ కనుగొనడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News