Friday, April 26, 2024

గులాబీలో ఫుల్ జోష్

- Advertisement -
- Advertisement -

పల్లా గెలుపుతో అంబరాన్ని తాకిన సంబురాలు
మంత్రి అజయ్‌ను ప్రత్యేకంగా అభినందించిన సిఎం
ఇదే ఊపుతో కార్పొరేషన్ ఎన్నికలకు క్యాడర్ సిద్ధ్దం
జోరు మీదున్న ఖమ్మం నగర క్యాడర్

Palla Rajeshwar Reddy won in MLC Elections

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ప్రతిష్టాత్మకంగా జరిగిన పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించడంతో ఉమ్మ డి ఖమ్మం జిల్లాలోని గులాబీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపుకుంది. దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాల్లో ఒకింత ఢీలా పడ్డా క్యాడర్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఫూల్ జోష్ నింపాయి. పల్లా విజయం కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్లు, ఎంపిపిలు, జెడ్పీటిసిలు, సర్పంచ్‌లు అంతా అహోరాత్రులు శ్రమించి విజయాన్ని అందించారు. స్వతంత్ర అభ్యర్థ్ది తీన్మార్‌మల్లన్నపై భారీ మెజార్టీతో పల్లా గెలుపొందడంతో ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టిఆర్‌ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు.ఇదే ఉత్సాహంతో త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలకు ఖమ్మం నగర క్యాడర్ సిద్ధ్దం అవుతుంది.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకింత అపనమ్మకంతోనే టిఆర్‌ఎస్ కార్యకర్తలు శక్తిమేర పోరాడారు. ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రసెడెంట్ కెటీఆర్ ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు.దీంతో పై నుంచి క్రింది స్థ్దాయి వరకు పార్టీ క్యాడర్ ఓటు నమోదు నుంచి ఓటింగ్ వరకు సర్వం ఒడ్డారు. దీంతో అదినుంచి అధిక్యత కన్పించి చివరికి పల్లా గెలుపొందడంతో వారి సంతోషానికి అవదులు లేకుండాపోయాయి. శనివారం ఆర్ధ్దరాత్రి తరువాత అధికారికంగా పల్లా విజయాన్ని ఖారారు చేశారు. దీంతో ఆదివారం జిల్లావ్యాప్తంగా టిఆర్ ఎస్ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని తాకాయి.ఇదే ఉత్సాహంతో రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని నగర నాయకులు నిర్ణయించారు.
ఇప్పటి నుంచి ఇదే విజయోత్సహంతో ప్రతి డివిజన్ నాయకులు తమ తమ ఏరియాల్లో పనిచేసి కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని నిర్ణయించారు. రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అడుగు జాడలో నడిచి ఆయన అదేశాలమేరకు నగరంలో పార్టీని మరింత బలోపేతం చేసి అన్ని డివిజన్లో గులాబీ జెండా రేపరేపలాడేవిధంగా చే యాలని పార్టీ శ్రేణులు కంకణబద్తులై కదలాలని నిర్ణయించుకున్నారు.
ఎమ్మెల్సీగా పల్లా విజయం కోసం మంత్రి పువ్వాడ అజయ్ తనదైన శైలీలో వ్యూహరచన చేసి విజయాన్ని అందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పల్లాకు భారీగా ఓట్లు నమోదు అయిటట్లు కృషి చేసి సఫలికృతులయ్యారు. ఇందుకు పువ్వాడ కృషిని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలించి ప్రత్యేకంగా అభినందించారు.మమత ఆసుపత్రిలో కేవలం పట్టభద్రులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభ, ప్రసంగం తీరును పరిశీలించిన సిఎం పువ్వాడను భేష్ అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేగాకుండా అభ్యర్ది పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా కౌంటింగ్ హాల్ నుంచే మంత్రిపువ్వాడకు ఫోన్ చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం హైద్రాబాద్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమెమ్మెల్యేంతా మంత్రి పువ్వాడ నాయకత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా విజయం సాధించిన పల్లాను ముఖ్యమంత్రి శాలువాతో ఘనంగా సత్కరించారు.
పువ్వాడకు సిఎం కితాబు
ఖమ్మం కొత్త ఒరవడిని సృష్టిస్తూ తనకంటూ కొత్తమార్క్‌ను ఏర్పాటుచేస్తూ టిఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న యువ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించేందుకు చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఖమ్మం నియోజవర్గం నుండి అపురూప స్పందన వచ్చిందని దీనికోసం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్వయంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పర్యటించి టిఆర్‌ఎస్ క్యాడర్‌ను ఏకం చేస్తూ పట్టభద్రులను చైతన్యవంతుల్ని చేస్తూ టిఆర్‌ఎస్ చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఖమ్మం జిల్లా పట్టభద్రులను చైతన్యవంతులుచేసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మొదలైన అతి తక్కువ సమయంలోనే జిల్లావ్యాప్తంగా టిఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపేదిశగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పాడేలా శ్రమించిన మంత్రిని వెల్డన్ అజయ్‌కుమార్ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన లంచ్ కార్యక్రమంలో స్వయంగా రాష్ట్ర మంత్రుల సమక్షంలో మంత్రిని సీఎం కేసిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మమతా ఆసుపత్రి ఆవరణలో పట్టభద్రులతో ఏర్పాటు చేసిన బహిరంగసభతో నూతన ఉత్తేజం వచ్చిందని అదేవిజయానికి నాంధి పలికిందని సిఎం పువ్వాడను అభినందించారు.
అంబరాన్ని తాకిన సంబురాలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో తెలంగాణ భవనంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధ్ది సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వర్‌రావు,సుడాచైర్మన్ బచ్చువిజయ్‌కుమార్, జిల్లాపార్టీ ఇంచార్జ్ ఆర్‌జెసి కృష్ణ,నగర అధ్యక్షులు కమర్తపు మురళీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న బాణసంచా కాల్చి మిఠాయిలను పంచుకున్నారు.అదేవిధంగా వైరా మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాములు నాయక్, మార్కేఫేడ్ ఉపాధ్యక్షులు బొర్ర రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ మోటర్ సైకిల్ ర్యాలీతో విజయోత్సహ ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మున్సిపల్ చైర్మన్ మహేశ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున్న బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కొత్తగూడెం పట్టణంలో స్థ్దానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు తనయుడు వనమా రాఘవేందర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున్న బాణసంచకాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఖమ్మంలోని మాజీ ఎంపి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ ఇంచార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి నాయకత్వంలో భారీగా టపాకాయలను కాల్చీ స్వీట్లను పంపిణీ చేశారు. అదే విధంగా నగరంలో పలు డివిజన్లో టిఆర్ ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. టిఆర్‌ఎస్ మహిళావిభాగం ఆధ్వర్యంలో నగరంలోని టిఆర్‌ఎస్ కార్యాలయంలో స్వీట్లను పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News