Friday, September 26, 2025

పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయండి: మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

మంత్రి పొంగులేటి పేదవాడి సొంతింటి కలను నెరవర్చే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి పొంగులేటి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మాజిద్‌పూర్ గ్రామ కార్యదర్శిపై లోతైన విచారణ జరపాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లా తాండూరు మండలంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పేదలను ఇబ్బందిపెట్టి వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదును తక్షణం ఆయా జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపడంతో పాటు సచివాలయంలోని తన కార్యాలయానికి కూడా పంపించాలని అధికారులకు ఆయన సూచించారు. ఇటువంటి ఫిర్యాదులపై తమ కార్యాలయం కూడా మానిటరింగ్ చేస్తుందని ఆయన తెలిపారు. లంచమడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 18005995991కు కాల్ చేసి వివరాలను తెలియజేస్తే 24 గంటల్లో యాక్షన్ తీసుకుంటామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. అవినీతికి సంబంధించి పలు సంఘటనలపై మంత్రి పొంగులేటి చేపట్టిన చర్యలు ఇలా ఉన్నాయి.

ఫొటో అప్‌లోడ్ చేయడానికి రూ.10 వేలు
అధికారులు లంచం అడుగుతున్నారని ఓ లబ్ధిదారుడు ఏకంగా పోలీసుస్టేషన్‌లోనే ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపై ఫిర్యాదు చేయగా, మరో ఫిర్యాదుదారుడు పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు చేయడం విశేషం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…సంగారెడ్డి జిల్లా నిజాంపేట, ఏదులతండాకు చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు అంగోత్ తులసీభాయి హౌసింగ్ కార్పొరేషన్‌లోని కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తన ఇల్లు నిర్మాణం పునాదుల వరకు పూర్తయిందని, అయితే, అంతవరకు ఫొటో తీసి పంపడానికి పంచాయతీ కార్యదర్శి పి. మహబూబ్ అలీ రూ.10 వేల రూపాయలను డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తాము రూ.5వేలు ఇచ్చామని అయినప్పటికీ ఇంటి పునాదుల ఫొటోను అప్‌లోడ్ చేయలేదని ఫిర్యాదు చేశారు. విచారణలో ఫోన్ పే ద్వారా అతనికి డబ్బులు చెల్లించినట్లు అధికారుల విచారణలో తేలింది.

Also Read: ఆర్‌టిసి బస్సెక్కితే బహుమతులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News