Saturday, May 4, 2024

పంజాగుట్ట సిఐపై సస్పెన్షన్ వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ కేసులు నిర్లక్ష్యం వహించాడని పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గా రావును సిపి సస్పెండ్ చేశారు. కేసు విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును సస్పెండ్ చేశారు. డ్రైవింగ్ చేసిన బోధన్ మాజీ ఎంఎల్‌ఎ షకీల్ కొడుకు సాహెల్ అలియాస్ రహేల్‌ను తప్పించి డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపణలు రావడంతో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడింది.

డిసెంబర్ 23న ప్రజా భవన్ ఎదుట బారీకేడ్లను షకీల్ కుమారు రహేల్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు మరో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కారు ర్యాష్ డ్రైవింగ్ దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఈ కేసులో రహేల్ ను తప్పించి మరొకరు కారు నడుపుతున్నట్టు పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనపై సిపి విచారణకు ఆదేశించారు. సిసి కెమెరా దృశ్యాల ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కుమారుడు రహేల్ అని పోలీసులు తేల్చారు. షకీల్ కొడుకు రహేల్ పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News