Monday, April 29, 2024

హైదరాబాద్‌లో సన్‌బర్న్ ఈవెంట్ రద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ సిటీ బ్యూరో : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మదాపూర్‌లో నిర్వహించనున్న సన్‌బర్న్ ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి బుక్‌మై షోలో టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకోకుండా టికెట్లు విక్రయించినందుకుగానూ బుక్ మై షో, నోడల్ అధికారులకు నోటీసులిచ్చారు.

ప్రస్తుతం బుక్ మై షోలో ’సన్ బర్న్ షో హైదరాబాద్’ ఈవెంట్ కనిపించడం లేదు. విశాఖ వేదికగా జరగబోయే ఈవెంట్ టికెట్లు మాత్రం అమ్ముడుపోతున్నాయి. సన్‌బర్న్ అనేది భారీ సంగీత వేడుక. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో మద్యం అనుమతి ఉంటుంది. ఇదే అదునుగా భావించి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆ వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకులను, బుక్ మై షో ప్రతినిధులను పిలిపించుకుని గట్టిగా మందలించారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వహణపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News