Friday, May 3, 2024

ఇదంతా జస్ట్ ఫర్ ఫన్!

- Advertisement -
- Advertisement -

Parineeti Chopra

 

బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా తాను పెళ్ళికి సిద్ధమని అంటోంది. అయితే పెళ్లి కొడుకు ఎక్కడున్నాడో వెతికి చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ‘రిక్వెస్ట్’ చేసింది. సీరియస్‌గా కాదండోయ్… సరదాకి మాత్రమేనట! పెళ్లీడు ఎప్పుడో వచ్చేసినా పెళ్ళి గురించిన ఆలోచనలు ప్రస్తుతానికి లేవట ఈ భామకి. మరి సోషల్ మీడియా వేదికగా పెళ్లి కొడుకు కావాలంటూ ఎందుకు అభ్యర్థించినట్లు.? అంటే, దానికీ ఓ పెద్ద కథే వుంది. ఈ బ్యూటీ ఇటీవలే బ్రైడల్ గెటప్‌లో ఫొటో సెషన్ చేయించుకుంది. అదీ అసలు సంగతి. ఓ మ్యాగజైన్ కోసం హాట్ ఫొటో సెషన్‌ని ట్రెడిషనల్ బ్రైడల్ గెటప్‌లో చేయించుకున్న పరిణితి చోప్రా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… “నేను పెళ్లికి రెడీ.. పెళ్లి కొడుకు కావలెను” అని పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు పెట్టేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. “ఆగండాగండీ… ఇదంతా జస్ట్ ఫర్ ఫన్..” అని ఆతర్వాత స్పష్టంగా చెప్పింది ఈ బ్యూటీ. అయితే తన పెళ్లికి కొంత సమయం ఉందని చెప్పిన పరిణీతి చోప్రా ప్రస్తుతానికైతే తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని పేర్కొంది.

 

Parineeti Chopra says she is ready for marriage
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News