Tuesday, April 30, 2024

3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

- Advertisement -
- Advertisement -

Palla-Rajeshwar-Reddy

 

రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్‌ఎసి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రతి పక్ష పార్టీల నాయకులు ఊర్లలోకి పోతే రైతులు ఛీ కొడుతారన్నారు. శవాల మీద ప్యాలలు వేరుకునే ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారని, ప్రపంచ వ్యాప్తంగాఅన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థ కుదేలు అయిన విషయం రాజకీయ పార్టీల నేతలు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం ఆందోళన విడిచి ఆనందం వ్యక్తం చేస్తోందన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనాలని సిఎం కెసిఆర్ ఆదేశించారన్నారు.

ప్రతి గింజ కొంటాం ప్రతి పైసా చెల్లిస్తామన్నారు. ఇప్పటికే 3008 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు దీని ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 830 కొనుగోలు కేంద్రాల ద్వారా 78,413 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత రబీలో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. వరి ధాన్యానికి రూ.25 వేల కోట్లు, మొక్కజొన్న కొనుగోలుకు రూ.3200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ధాన్యం స్టోరేజీ కోసం రైస్ మిల్లర్‌లు, ఎఫ్‌సిఐతో చర్చించినట్లు తెలిపారు. గన్ని బ్యాగ్ ల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం 30 లక్షల మెట్రిక్ టన్నుల కు సరిపోను అందుబాటులో ఉన్నాయన్నారు.

Purchase of 3 lakh metric tonnes of grain
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News