Thursday, May 16, 2024

త్వరలోనే మీ ముందుకు వస్తా: పవన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కరోనా కట్టడిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రుల్లో ఇతర సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మున్సిపల్, పంచాయతీ ఉద్యోగులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తాను త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానన్నారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ముందస్తు ఏర్పాట్లు అవసరమని, ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

pawan kalyan releases press note on his health

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News