Tuesday, April 30, 2024

మొగులయ్యకు పవన్‌ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘భీమ్లా నాయక్’ చిత్రంలో హీరో పరిచయ గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకు స్టార్ హీరో పవన్‌కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ‘లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షలు అందజేయనున్నట్లుగా ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా, సంగీత దర్శకుడు థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Pawan Kalyan rewards Rs 2 lakh for Mogulaiah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News