Wednesday, May 8, 2024

పేటీఎంలో టీకా బుకింగ్ సౌకర్యం

- Advertisement -
- Advertisement -

Paytm users can now book COVID-19 on app

 

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉన్న కొవిడ్ యాప్‌తోపాటు థర్డ్ పార్టీ డెవలపర్ల నుంచి వ్యాక్సిన్ స్లాట్‌ల బుకింగ్‌కు కేంద్రప్రభుత్వం గత నెలలో అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తమ యాప్‌లో వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్‌ను ప్రవేశ పెట్టినట్టు సోమవారం ప్రకటించింది. పేటీఎం వినియోగదారులు తమ సమీపం లోని టీకా కేంద్రాలను తెలుసుకోడానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా స్లాట్‌లను నమోదు చేసుకోడానికి సహాయపడుతుందని వెల్లడించింది. అందుబాటులో ఉన్న టీకా రకంతోపాటు దాని రుసుం, ఇతర వివరాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News