Sunday, May 5, 2024

కొత్తగా నమోదైన బీడీ కార్మికులకూ పెన్షన్: కోరుట్లలో కేసీఆర్

- Advertisement -
- Advertisement -

కోరుట్ల: కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. కోరుట్లలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకునేందుకు బడ్జెట్లో నిధులు పెంచి, వారికోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు.

ఎన్నికలు వస్తాయి, పోతాయి. ఎవరో ఒకరు ఎన్నికవుతారు. అయితే ఆ అభ్యర్థి పూర్వాపరాలను, అతను ప్రాతినిథ్యం వహించే పార్టీ చరిత్రను పరిశీలించి ఓటు వేయాలని సిఎం హితవు చెప్పారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా పరిణతి చెందలేదని, ఓటే మన తలరాతను మారుస్తుందని చెబుతూ ఏ పార్టీ మంచి చేస్తుందో గ్రామాలలో చర్చించి, ఓటు వేయాలన్నారు.

ఒకప్పుడు రైతులు వ్యవసాయానికి కరెంటు లేక ఇబ్బందులు పడేవారనీ, ఇవాళ 24 గంటలూ కరెంటు ఇస్తున్న రాష్ట్రం దేశం మొత్తంమీద తెలంగాణాయేనని కేసీఆర్ అన్నారు. వ్యవసాయానికే కాదు, దుకాణాలకు, పరిశ్రమలకు కూడా తెలంగాణాలో రోజంతా కరెంటు అందుతోందన్నారు. కాంగ్రెస్ నాయకులు మూడు గంటలు కరెంటు ఇస్తే చాలంటున్నారని, అలా జరిగితే మళ్లీ రైతులకు తిప్పలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ధరణి పోర్టల్ ను పెట్టి, రైతులకు కొండంత అండగా తెలంగాణ ప్రభుత్వం నిలబడిందని కేసీఆర్ చెప్పారు. ధరణి వల్లనే రైతుల డబ్బులు వారి ఖాతాల్లో నేరుగా పడుతున్నాయన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలోకి విసిరేస్తామంటున్నారని చెబుతూ, ‘ధరణి ఉండాలా, వద్దా?‘ అని ప్రజలను నేరుగా ప్రశ్నించారు. జనమంతా ధరణి ఉండాలంటూ బదులిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News