Sunday, April 28, 2024

పండగకు ఊరికి వెళ్తే…. దొంగలు వస్తారు….జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరోః దసరా పండగకు గ్రామాలకు వెళ్తున్న వారికి సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. చాలామంది దసర పండగకు గ్రామాలకు వెళ్తుండడంతో ఇంటికి తాళం వేసి వెళ్తారు. ఇదే అదునుగా భావించిన పోలీసులు ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు. ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోవాలని లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోవాలని సూచించారు. మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే వెంటనే డయల్ 100, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 కు లేదా వాట్సాప్ నెంబర్ 9490617444కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.
సెలవులలో బయటకు వెళుతున్నప్పుడు సెక్యూరిటి అలారం, మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళము అమర్చుకోవాలి.
ఊరికి వెళ్తున్న విషయం స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.
మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి.
మీ వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకొండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి, వీలైతే చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వేయడం మంచిది.
నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటి గార్డులుగా నియమించుకోండి.
మీ ఇంట్లో అమర్చిన సిసి కెమెరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.
ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్‌పేపర్లు, పాలప్యాకెట్లు జమ కాకుండా చూడాలి. వాటిని కూడా గమనించి దొంగతనాలకు పాల్పడుతారు అన్న విషయం గమనించండి.
మెయిన్ డోర్ కి తాళం వేసినప్పటికి అవి కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయాలి.
బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది.
ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తు ఉండమని చెప్పాలి.
మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు, ఇంటిలోపల సిసి కెమెరాలు అమర్చు కొని విఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో ఉంచండి.
అల్మరా, కప్ బోరడ్స్‌కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపులు, దిండ్ల క్రింద, అల్మరా పైన, డ్రెస్సింగ్ టేబుల్‌లో, కప్ బొరడ్స్‌లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో ఉంచాలి.
బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్‌లకు, గుడికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రతలు తీసుకోవాలి.
సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయవద్దు.
సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు.
కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News