Sunday, May 5, 2024

కొవిడ్‌కు ఫైజర్ కొత్తమాత్ర : అమెరికా ఆమోదం

- Advertisement -
- Advertisement -

Pfizer Covid-19 pill now authorized by FDA

వాషింగ్టన్ : కొవిడ్ బాధితులకు ఊరటనిచ్చేలా అమెరికా తొలిసారి ఓ మాత్రను అందుబాటు లోకి తెచ్చింది ఈమేరకు ఫైజర్ రూపొందించిన పాక్స్‌లోవిడ్ పిల్‌ను చికిత్సకు వినియోగించవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇంటివదే చికిత్స పొందుతూ తీసుకొనేలా ఈ ఔషధానికి అనుమతి లభించింది. చౌకగా లభించే ఈ మాత్ర కొవిడ్ ప్రారంభ దశలో వేగవంతమైన చికిత్స అందించడానికి పనిచేస్తుందని తెలిపారు. ప్రారంభంలో ఈ ఔషధం సరఫరా చాలా పరిమితమేనని చెబుతున్నారు. కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వారికి, ఆస్పత్రి పాలయ్యే ముప్పు ఎక్కువగా ఉన్నవారికి ప్రారంభ దశలోనూ ఈ మాత్రను వినియోగించ వచ్చని అధికారులు తెలిపారు. ఈమేరకు ఫైజర్‌మాత్రను వయోజనులకు 12 ఏళ్లు, ఆ పైబడిన పిల్లలకు వినియోగించేందుకు అమెరికా లోని ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డిఎ ) అనుమతించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News