Wednesday, May 1, 2024

పిజి మెడికల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -
PG medical admission notification released in TS
20 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్ : రాష్ట్రంలోని పిజి వైద్య విద్య కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ -పిజి- 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పిజి డిప్లొమా, డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలి. కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News