Tuesday, May 14, 2024

డ్రాగా ముగిసిన పింక్ బాల్ టెస్టు

- Advertisement -
- Advertisement -

Pink Ball Test between Aus and Ind women's teams ended in draw

ఆద్యంతం ఆధిక్యత కనబరచిన మిథాలీ సేన

క్వీన్స్‌లాండ్: ఆస్ట్రేలియా, భారత మహిళల జట్ల మధ్య జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఆస్ట్రేలియాకు వారి సొంత గడ్డపైనే చుక్కలు చూపించారు. ఆడుతున్నది తొలి డే నైట్ టెస్టు అయినప్పటికీ చివరి వరకూ విజయం కోసం ప్రయత్నించారు. చివరి రోజు ఈ మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడు వికెట్ల నష్టానికి 143 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు తన తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 9 వికెట్లకు 241 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్‌సను డిక్లేర్ చేసింది.

ఆ తర్వాత తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రాంభించిన మిథాలీ సేన 3 వికెట్లకు 135 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఆతిథ్య జట్టుకు సవాలు విసిరింది. అప్పటికి మిగిలి ఉన్న ఓవర్లు 36 కాగా విజయం కోసం ఆస్ట్రేలియా చేయాల్సిన పరుగులు 272.అయితే చివరికి ఆస్ట్రేలియా 15 ఓవర్లలో36 పరుగులు చేసిన సమయంలో రెండు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించాయి.

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ స్మృతి మంధానా( 127, 31) ప్ల్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి రెండు రోజుల్లో వర్షం కారణంగా దాదాపు 80 ఓవర్ల ఆట నష్ట పోవడంతో డ్రా అనివార్యం అయింది. అయినప్పటికీ ఆడిన తొలి డేనైట్ టెస్టులోనే భారత మహిళల జట్టు స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంది. అటు బ్యాటింగ్‌లోను, ఇటు బౌలింగ్‌లోను ఆస్ట్రేలియాపై స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News