Sunday, April 28, 2024

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. ఇషాన్ కు షాక్.. పుజారాకు నిరాశ..

- Advertisement -
- Advertisement -

స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ, భారత జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ముందుగా రెండు టెస్టు మ్యాచ్ లకు జట్టును ఎంపిక చేసింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన టీమిండియాను శుక్రవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో ఇద్దరు కొత్త ఆటగాళ్లు ఆవేష్ ఖాన్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌ లకు అవకాశం కల్పించారు. తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ కు కూడా చోటు కల్పించారు. అయితే, ఇషాన్ కిషన్ కు బీసీసీఐ షాకిచ్చింది.

ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఇషాన్ వ్యక్తిగత కారణాలతో.. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే భారత్‌కు తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్ కు కిషన్‌ను ఎంపిక చేయలేదు. ఇన్నో ఆశలు పెట్టుకున్న పూజారాకు కూడా నిరాశ తప్పలేదు. ఇటీవల రంజీ ట్రోఫీలో అద్భుత ఫామ్ తో రాణించినా సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. గాయం కారణంగా మహ్మద్ షమిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

కాగా, భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్టు విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News