Sunday, April 28, 2024

ఉల్లి కొనుగోలును తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రభుత్వం తిరిగి ఉల్లి కొనుగోలును మంగళవారం ప్రారంభించింది. ముందున్న పండగ సీజన్ కారణంగా ఎగుమతులను కట్టడి చేసి రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో క్వింటాల్ రూ. 2410 వంతున కొనుగోలు చేస్తుంది. ఈ నెల 19న ఉల్లి ఎగుమతులను కట్టడి చేయడానికి , స్థానికంగా లభ్యత పెంచడానికి 40 శాతం వరకు ఎగుమతి సుంకం విధించింది.

ఈ సందర్భంగా రైతుల నుంచి అదనంగా మరో 2 లక్షల టన్నుల ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేంద్ర వాణిజ్య, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ సంస్థల ద్వారా మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌ల్లో కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News