Wednesday, May 15, 2024

పి కె ఎరువుల సబ్సిడీ రూ 60,939 కోట్లు

- Advertisement -
- Advertisement -

PK fertilizer subsidy is Rs 60,939 crore

గత ఏడాది కన్నా అధికం
కేంద్ర మంత్రిమండలి ఆమోదం
తక్కువ ధరలకు డిఎపి యూరియా

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రూ 60,939 కోట్ల ఎరువుల సబ్సిడీపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో రైతాంగం మేలుకు డిఎపి సహా ఫాస్పేటిక్, పోటాసిక్ ఎరువులకు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి ఈ మొత్తాన్ని (రూ 60,939.23 కోట్లు) సబ్సిడీగా సమకూర్చే నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. రైతాంగానికి భూ సారాలను అందుబాటు ధరలలో అందించడానికి వీలుగా ఈ ఎరువుల సబ్సిడీ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఈ రెండు రకాల ఎరువులను పి అండ్ కె ఫర్టిలైజర్స్‌గా పిలుస్తారు. వీటికి పౌష్టికత ప్రాతిపదికన సబ్సిడీని కల్పించినట్లు ఆ తరువాత అధికారిక ప్రకటనలో తెలిపారు. ఎప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ సాగే ఖరీఫ్ సీజన్‌కు ఈ పికె ఫర్టిలైజర్స్ సబ్సిడీ ధరలకు అందేందుకు వీలేర్పడుతుంది.

కేంద్రం దేశీయ ఎరువుల మద్ధతు (ఎస్‌ఎస్‌పి)ను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఎరువుల రవాణ ఇతరత్రా సబ్సిడీలు ఉంటాయి. ఈ విధంగా దేశంలో ఉత్పత్తి అయ్యే ఎరువులకు, దిగుమతుల కోటాకు సబ్సిడీలు ఉంటాయి. మంత్రివర్గ కీలక నిర్ణయాన్ని ఆ తరువాత సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపితే ఈ ఎరువులకు సబ్సిడీ దాదాపు 57,150 కోట్లు వరకు ఉంది . ఇప్పుడు 202223 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఈ సబ్సిడీ మొత్తం రూ 60, 939 కోట్లు అని మంత్రి వివరించారు.

డిఎపి బ్యాగ్‌పై రూ 2501 సబ్సిడీ

ఇప్పుడు రైతులకు డిఎపి ఎరువులపై సబ్సిడీని పెంచారు. బ్యాగ్ ఒక్కింటికి రూ 2501 సబ్సిడీ ఉంటుంది. దీనితో రైతులు వీటిని బ్యాగ్ ఒక్కటి రూ 1,350కు పొందవచ్చు. డిఎపి బ్యాగ్ ఎరువు ధర రూ 3851గా ఉంది. 2020-21లో సబ్సిడీ బ్యాగుకు రూ 512 వరకూ ఉంది. ఇప్పుడు సబ్సిడీని ఏకంగా అయింతలు పెంచారు. ఈ విధంగా ఈ సబ్సిడీ విలువ ఇప్పుడు రూ 2501 గా నిలిచిందని మంత్రి వివరించారు.

నక్సల్స్ ప్రభావ ఏరియాల్లో మొబైల్ అప్‌గ్రేడ్

దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాలలోని భద్రతా స్థావరాలకు మొబైల్ సేవలు అధునాతనం చేస్తారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని పరిధిలో 2 జి మొబైల్ సర్వీసులను 4 జి సర్వీసులుగా అధునీకరిస్తారు. సంబంధిత సార్వత్రిక సేవల కట్టుబాట్ల నిధి (యుఎస్‌ఒఎఫ్)కి కేబినెట్ ఆమోదం తెలిపింది. అప్‌గ్రేడ్ పనులను బిఎన్‌ఎన్‌ఎల్ నిర్వహిస్తుంది. అప్‌గ్రేడ్‌కు పన్నులు సుంకాల మినహాయింపులతో కలిసి చూస్తే రూ 1,884.59 కోట్లు ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News