Sunday, April 28, 2024

కరోనా వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్లాస్మానే వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

Plasma vaccine until Corona vaccine arrives

 

కరోనా జయించిన ఒకవ్యక్తి ప్లాస్మాతో 48 మంది ప్రాణాలు కాపాడవచ్చు

ఒకరు ఏడాదిలో 24 పర్యాయాలు ప్లాస్మా దానం చేయవచ్చు

ఒక్కరి ప్లాస్మాతో ఇద్దరికి ప్రాణదానం

ది ప్లాస్మా డోనర్ సాంగ్ ఆవిష్కరణ సభలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్

మనతెలంగాణ/హైదాబాద్: కరోనా రోగులకు ప్లాస్మానే వ్యాక్సిన్ అని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ చెప్పారు. కరోనా వాక్సిన్ వచ్చేంతవరకు కరోనానుంచి కోలుకున్న ఒకవ్యక్తి ప్లాస్మా దానం చేసి 48 మంది కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని ఆయన తెలిపారు. మంగళవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సుప్రసిద్ధ సంగీత దర్శకుడు మణిశర్మ రూపొందించిన ది ప్లాస్మా డోనర్స్ పాటను ర్యాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ కరోనాయోధులు ప్లాస్మా దానంపైనే దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే తన కుటుంబంలో గత సంవత్సరం డెంగ్యూతో బాధపడిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పారు. ఏదైనా మనవరకు వస్తే కానీ దాని విలువ తెలియదని చెప్పారు. గత సంవత్సరం తనభార్యకు డెంగ్యూ రావడంతో ఎంతో బాధపడ్డాను అని ఆయన చెప్పారు.

డెంగ్యూ రావడంతో డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. అయినప్పటికీ రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ప్లెట్‌లెట్స్ కౌంటింగ్ 10 వేల లోపల అయింది. చికిత్స చేస్తున్న డాక్టర్ ఎంవి రావు ప్లాస్మా ఎక్కించాల్సిందేనని చెప్పారు. ప్లాస్మాకు మినహా వేరే అవకాశం లేదన్నారు. అప్పటివరకు ప్లాస్మా గురించి తెలియని తాను ప్లాస్మాదాతల కోసం అన్వేషణ ప్రారంభించాను అన్నారు. తన దగ్గరగా ఉండే మిత్రులను ఎంపిక చేసుకుంటే అందులో ఒకరి బ్లడ్ గ్రూప్ మాత్రమే మ్యాచ్ అయ్యిందని, దాంతో ప్లాస్మా ఇవ్వడంతో ఈ గండం నుంచి బయట పడగలిగామని తన బాధను గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుత కోవిద్ పరిస్థితుల్లో కోవిద్ యోధులు వ్యాక్సిన్ వచ్చే వరకు మీరే వ్యాక్సిన్ అని సంతోష్ చెప్పారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు దీనికి మందు లేదు. ప్లాస్మా ఒక్కటే మందు అన్నారు. కోవిడ్19ను జయించిన ఒక్క యోధుడు తన ప్లాస్మాతో 48 మందిని బతికించవచ్చని చెప్పారు. కరోనా జయించిన యోధుడు సంవత్సరానికి 24 సార్లు ప్లాస్మా దానం చేస్తూ 48 మందిని బతికించవచ్చు, ఒక్కసారి ప్లాస్మా తీసుకుంటే ఇద్దరిని బతికించవచ్చని ఆయన చెప్పారు. షాద్‌నగర్ శ్రీకాంత్ 7 సార్లు చేశారు, ఇక్కడున్న మిగతావారు కూడా రెండు లేదా మూడు సార్లు ప్లాస్మా దానం చేశారని వారిని ఆయన అభినందించారు. కోవిడ్ జయించిన యోధులందరూ ఎన్ని సార్లు అవకాశం ఉంటే అన్ని సార్లు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్మాదానంతో ఎలాంటి ఆరోగ్యసమస్యలు రావని ఆయన చెప్పారు.

కుటుంబసభ్యులకు కూడా కరోనా యోధులు ఈ విషయాన్ని చెప్పాలని ఆయన కోరారు. కోవిడ్ పేషెంట్స్ ఉంటారు ప్లాస్మా ఇచ్చేవారుకూడా ఉంటారు వీరిద్దరి మధ్య కోవిడ్ యోధులు వారధిలాగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న వాలింటరీలు మరికొంతమందిని చేర్చుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. టెక్కీలు, ప్రముఖులు కూడా ప్లాస్మాదానం చేసేందుకు అవగాహన కల్పించాలని చెప్పారు. వాటింటరీలు ఒక్కొక్కరూ వేయిమందిని ప్రభావితం చేయలని ఆయన చెప్పారు. ప్లాస్మా దాతలపై వీడియో సాంగ్ చేయడం ఎంతో గొప్పవిషయం దేనికైన దృశ్యమాధ్యమం ఎంతో గొప్పగా ఉంటుంది. పదిమాటల కంటే ఒక దృశ్యం సులువుగా అర్థం అవుతుందన్నారు. ది ప్లాస్మా డొనేషన్ పాట పాడిన శ్రీరాం, సాకేత్‌ను శాలువతో సంతోష్‌కుమార్ అభినందించారు. అలాగే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, పోలీసు ఉన్నాతాధికారులు, ఎంఎల్‌సి నవీన్ రావు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News