Saturday, April 27, 2024

హామీలు ఎగ్గొట్టే కుయుక్తులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ముం దు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన లేని కాంగ్రెస్, వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చే స్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. మన బలం, మ న గళమైన గులాబీ జెండా పార్లమెంట్‌లో ఉం డాలని, లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు న ష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన మెదక్ లోక్‌సభ సన్నాహక సమావేశానికి ప్రజాప్రతినిధులు, మా జీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో పార్టీ కా ర్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ సీనియర్ నేత లు హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ప్రశాంత్ రెడ్డి భేటీకి హాజరయ్యా రు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించారు.

గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ల అయ్యిందని, తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు విఫమయ్యిందని అబద్ధాలు మాట్లాడించారని, అందుకే అది తప్పని నిరూపించేలా తెలంగాణ సమగ్ర అభివృద్ధిపై గణాంకాలు, ఆధారాలతో స్వేద పత్రం విడుదల చేశామని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు..మొత్తం లెక్క తెస్తే 420 హామీలు ఇచ్చారని, దీన్ని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్‌గా ఉండి, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అన్నారని గుర్తు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వ్యవసాయ రుణాలు విడతల వారీగా మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని విస్మరించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రుణాలను కూడా ముక్కు పిండి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు ఎన్నికలప్పుడు ఒక మాట…ఎన్నికలు ముగియగానే ఇంకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.

తుమ్మల నాగేశ్వర రావు రుణాలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని, లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నారని అన్నారు. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామి ఇచ్చారని, కానీ అది సాధ్యం కాదని ఇటీవల స్పష్టమైందని చెప్పారు. నోటికి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని, అందుకే 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టమని స్పష్టం చేశారు. ఓవైపు ప్రధాని, అదానీ ఒక్కటే అంటూ విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి మరోవైపు ఆయనతోనే ఒప్పందాలు చేసుకుంటున్నారని కెటిఆర్ విమర్శించారు.

రాహుల్ గాంధీ నిన్ననే అదానీని తిడితే, రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బిజెపి నాయకుల అసలు రంగు బయట పడుతున్నరని చెప్పారు. రేవంత్ డబుల్ ఇంజిన్ అంటే అదానీ,ప్రధాని అన్నారని, అదే అదానీతో రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకుంటారని అన్నారు. బిఆర్‌ఎస్‌ను బిజెపి బి టీం అన్నారని, కానీ బిజెపి చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రశ్నించదు..కాంగ్రెస్‌ను బిజెపి ప్రశ్నించదని పేర్కొన్నారు. ఎవరు ఎవరికి టీమో ప్రజలు ఆలోచించాలని కోరారు. బండి సంజయ్ బాహాటంగా కాంగ్రెస్, బిజెపిలు కలిసి పని చేయాలని అంటున్నారని, ఎవరికి ఎవరు దోస్తులో బండి సంజయ్ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. కెసిఆర్ ఉన్నంత కాలం ఆదానీత ఇక్కడ అడుగు పెట్టలేదని కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నారని పేర్కొన్నారు.
మెదక్ ఎంపి స్థానం భారీ మెజారిటీతో గెలవాలి
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్, హరీశ్ రావుల నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేయడంతో గత ఎంపి ఎన్నికల్లో మెదక్‌లో అత్యధిక మెజార్టీ సాధించామని, ఈసారి కూడా మెదక్‌లో గులాబీ జెండా ఎగరబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ నియోజక వర్గం బిఆర్‌ఎస్‌కు కంచుకోట అని స్పష్టం చేశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవాలని అన్నారు. గత పదేళ్లలో తెలంగాణ తరఫున గళం విప్పింది మన బిఆర్‌ఎస్ ఎంపిలు అనే విషయం మరచిపోవద్దని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బిఆర్‌ఎస్ మాత్రమే అని అన్నారు. తపార్టీ శ్రేణులు నిరాశ వీడాలి… బయటికి రావాలని కెటిఆర్ చెప్పారు.
ముల్లును ముల్లుతోనే తీద్దాం : హరీశ్‌రావు
కొందరు బిఆర్‌ఎస్ పార్టీ నుంచి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని, ఆపద సమయంలో పార్టీకి అండగా ఉన్న వాళ్ళే మనోళ్లు అని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు హరీశ్‌రావు అన్నారు. పార్టీ శ్రేణులు ఎవ్వరూ అధైర్య పడొద్దు అని, భవిష్యత్తులో వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే మనకు ఆయుధం అని, ముల్లును ముల్లుతోనే తీద్దామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుందని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఇకపై సమర్ధంగా తిప్పికొడతామని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు సింహాలై గర్జించాలని, అందరూ కసితో పని చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కెసిఆర్ కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, ఎన్నో అవమానాలు భరించి కూడా కెసిఆర్ నిలబడ్డారు కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. ఇపుడు ఈ ఓటమిని స్వీకరించి మరో గెలుపు కోసం అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం గురించి కార్యకర్తలు విలువైన సూచనలు చేశారని, వాటిని కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. కెసిఆర్ పథకాల అమలులో పోటీ పడితే, ఇపుడు కాంగ్రెస్ వాళ్లు అక్రమ కేసుల బనాయింపుల్లో పోటీ పడుతున్నారని విమర్శించారు. పోలీసులను వాడుకుని బిఆర్‌ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులను చేస్తున్నారని మండిపడ్డారు. అయినా భయపడేది లేదు అని, పోలీస్ స్టేషన్లు, జైళ్లు పోరాటాలు మనకు కొత్త కాదని అన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలందరూ అండగా ఉంటారని తెలిపారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బిజెపికి నాయకత్వం లేదని, ఈ సారి కూడా మెదక్ పార్లమెంట్ సీటు భారీ మెజారిటీతో గెలవాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News